Advertisementt

రాజా సాబ్ ప్లాన్స్ మాములుగా లేవు

Fri 07th Nov 2025 10:34 AM
the raja saab  రాజా సాబ్ ప్లాన్స్ మాములుగా లేవు
Raja Saab New Game Plans రాజా సాబ్ ప్లాన్స్ మాములుగా లేవు
Advertisement
Ads by CJ

నిన్నటివరకు అసలు రాజా సాబ్ జనవరి 9 కి విడుదలవుతుందా అనే అనుమానాలను ప్రొడ్యూసర్స్ పటాపంచలు చేసేసారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజా సాబ్ జనవరి 9 నే విడుదల అని చెప్పారు. ఇప్పుడు రాజా సాబ్ విషయంలో మేకర్స్ ప్లాన్స్ మాములుగా లేవు. ఇప్పటివరకు ప్రమోషన్స్ విషయంలో ఫ్యాన్స్ లో కాస్త నిరాశ తొణికిసలాడింది. 

కానీ ఇప్పుడు ఆ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ బెంగ పెట్టుకోవక్కర్లేదు. రాజా సాబ్ ప్రమోషనల్ ప్లాన్స్ ని మేకర్స్ వేరే లెవల్లో ప్లాన్ చేస్తున్నారట. నవంబర్ మూడో వారం నుంచి రాజా సాబ్ మోత మోగిపోయేలా పక్కా ప్లానింగ్ తో ఉన్నారట. నవంబర్ మూడో వారంలో రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ వదిలి.. ప్రతి పది రోజులకి ఒక సింగిల్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. 

అంతేకాదు యుఎస్ లో డిసెంబర్ 25 క్రిస్టమస్ సందర్భంగా భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్న మేకర్స్ న్యూ ఇయర్ కి మాత్రం రాజ్ సాబ్ సెకండ్ ట్రైలర్ వదిలేందుకు రెడీ అవుతున్నారనే మాట ప్రభాస్ ఫ్యాన్స్ ని కూల్ చేస్తూ వారిని రిలాక్స్ మోడ్ లోకి వెళ్లేలా చేస్తుంది. ఇప్పటికే రాజా సాబ్ షూటింగ్ చాలావరకు ఫినిష్ అయ్యింది అని, ప్యాచ్ వర్క్ జరుగుతుంది అని తెలుస్తుంది. 

Raja Saab New Game Plans:

The Raja Saab promotional plans update

Tags:   THE RAJA SAAB
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ