క్యూట్ బ్యూటీ శ్రీలీల ఇప్పటివరకు చేసిన రోల్స్ చూస్తే కేవలం రిచ్ గర్ల్, లేదంటే కంపెనీ సీఈవో గానో, లేదంటే గ్లామర్ డాల్ గానో కనిపించింది తప్ప శ్రీలీల కు పెరఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ సరిగ్గా పడలేదనే చెప్పాలి. ధమాకా తర్వాత ఆమెకు టాలీవుడ్ లో పెద్ద హిట్ పడలేదు.
ఈ నెల చివరిలో మాస్ రాజా రవితేజ తో కలిసి మాస్ జాతర తో రాబోతుంది. ఈ చిత్రం పై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే తాజాగా శ్రీలీల ఓ లుక్ షేర్ చేసింది. ఆ లుక్ చూస్తే శ్రీలీల ఓ ఏజెంట్ లా కనిపించడం కాదు.. ఆ పోస్టర్ పై ఏజెంట్ మిర్చి అంటూ రాసుంది. మరి ఈ లుక్ ఏ సినిమాకి సంబంధించింది, అసలు ఏ భాష కు సంబంధించింది అనేది ఆమె అభిమానులకు అర్ధం కాక కన్యూజ్ అవుతున్నారు.
ఆమె ఏ సినిమా పోస్టర్ అని చెప్పకపోయినా శ్రీలీల ఏజెంట్ మిర్చి లుక్ చూసి ఆమె ఫ్యాన్స్ డిఫ్రెంట్ గా సర్ ప్రైజ్ అవుతున్నారు. ఆ పోస్టర్ తో పాటుగా శ్రీలీల మిగతా డీటెయిల్స్ ని ఈ అక్టోబర్ 19న రివీల్ చేస్తున్నట్టుగా హింట్ ఇచ్చింది. మరి శ్రీలీల హిందీ ప్రాజెక్ట్ కి సంబందించిన లుక్ ఏమో అని ఆమె అభిమానులు అనుమానపడుతున్నారు.