బిగ్ బాస్ సీజన్ 9 మొదలై వారమైంది. ఈ సీజన్ లోకి సెలబ్రిటీస్ vs కామనర్స్ అంటూ ఓ 15 మంది అడుగుపెట్టారు. సంజన, ఫ్లోరా షైనీ, సుమన్ శెట్టి, ఇమ్మాన్యువల్, భరణి, శ్రేష్టి శర్మ, టివి నటి ఇలా సెలబ్రిటీస్, అలాగే ఓ ఐదుగురు కామనర్స్ హౌస్ లో రచ్చ రచ్చ చేస్తున్నారు. సంజన అయితే తెగ ఇరిటేట్ చేస్తుంది.
ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారిలో ఫ్లోర్ షైనీ కానీ లేదంటే ఎటువంటి ఆట ప్రదర్శించని శ్రేష్టి వర్మ కానీ ఎలిమినేట్ అవ్వొచ్చని, వారిద్దరూ హౌస్ లోనే కాకుండా బయట కూడా ప్రేక్షకులకు రిజిస్టర్ కాకపోవడంతో వారికి ఓటింగ్ రాలేదు, దానితో ఒకరు ఈవారం ఎలిమినేట్ అవ్వాల్సిందే అన్నారు.
అనుకున్నట్టుగానే బిగ్ బాస్ సీజన 9 నుంచి మొదటి వారం ఎలిమినేషన్ ఎపిసోడ్ పూర్తవడంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారో అనేది అనేది లీకుల ద్వారా బయటికొచ్చేసింది. ఈ వారం హౌస్ నుంచి మొట్ట మొదటి ఎలిమినేషన్ నుంచి బయటికొచ్చింది జానీ మాస్టర్ పై కేసు పెట్టి ఫేమస్ అయిన శ్రేష్టి వర్మ. ఆమె హౌస్ లో టాస్క్ కానీ, లేదంటే మరేది చేయకపోవడంతో ఈ వారం ఆమెను ప్రేక్షకులు ఎలిమినేట్ చేసారు.