Advertisementt

టొవినో థామస్ నరివేట్ట ఓటీటీ డేట్ ఫిక్స్

Thu 03rd Jul 2025 08:59 PM
narivetta  టొవినో థామస్ నరివేట్ట ఓటీటీ డేట్ ఫిక్స్
Narivetta makes a digital debut on Sony LIV టొవినో థామస్ నరివేట్ట ఓటీటీ డేట్ ఫిక్స్
Advertisement
Ads by CJ

రీసెంట్‌గా రిలీజ్ అయిన మలయాళ యాక్షన్-డ్రామా నరివేట్ట చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అలాంటి బ్లాక్ బస్టర్ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. జూలై 11 నుంచి నరివేట్ట చిత్రం సోనీ లివ్‌లోకి రాబోతోంది. ఇండియా సినిమా కంపెనీ బ్యానర్‌పై టిప్పుషన్, షియాస్ హసన్ నిర్మించిన ఈ చిత్రానికి అనురాజ్ మనోహర్ దర్శకత్వం వహించారు. ఈ  నరివెట్ట చిత్రంలో టొవినో థామస్ ఇప్పటి వరకు పోషించిన ఓ పవర్ ఫుల్ పాత్రను పోషించారు.

ఓ యంగ్ అండ్ హానెస్ట్ పోలీస్ కానిస్టేబుల్‌గా వర్గీస్ (టొవినో థామస్) నటించారు. వయనాడ్ ప్రాంతానికి వర్గీస్ ట్రాన్స్‌ఫర్ అవ్వడం, అక్కడి పరిస్థితులపై పోరాడటం అనే కాన్సెప్ట్‌ను అద్భుతంగా చూపించారు. ఆదివాసీ సంఘాలు తమకు భూమిని కేటాయించడంలో ప్రభుత్వం ఆలస్యం చేయడంపై తీవ్ర నిరసనలో వెల్లువెత్తుతాయి. ఈ పరిస్థితుల్ని ఆ కానిస్టేబుల్ ఎలా చక్కబెట్టాడు అనేది కథ.

ఈ చిత్రంలో టోవినో థామస్‌తో పాటు, సూరజ్ వెంజరమూడు, చేరన్, ఆర్య సలీం, ప్రియంవద కృష్ణన్, ప్రణవ్ టియోఫిన్ వంటి వారు నటించారు. 

Narivetta makes a digital debut on Sony LIV:

Narivetta makes a digital debut on Sony LIV - Catch Tovino Thomas from 11th July

Tags:   NARIVETTA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ