అవును వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలన్నీ ప్రమోషన్స్ లో పోటీ పడుతున్నాయి. మన శంకర్ వర ప్రసాద్ గారైతే ఒక అడుగు అందరికన్నా ముందే ఉంటున్నారు. అలాగే సర్రున రేసులోకి దూసుకొచ్చిన రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి కూడా ప్రమోషన్స్ లో జోరు పెంచేశారు. ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్ అంటూ హడావిడి స్టార్ట్ చేసారు,.
మరోపక్క అనగనగ ఒక రాజు తో నవీన్ పోలిశెట్టి దూకుడు మీదున్నాడు. మరి సంక్రాంతి సినిమాలన్ని ఇంత హడావిడి చేస్తున్నా ప్రభాస్ రాజా సాబ్ సెకండ్ సింగిల్ విషయంలో మేకర్స్ మౌనంగా ఉన్నారు. రాజా సాబ్ కూడా తొందరపడాల్సిన సమయమొచ్చింది. థమన్ అఖండ 2 తో ఫ్రీ అయ్యాక రాజా సాబ్ సెకండ్ సింగిల్ అన్నారు.
కానీ అఖండ 2 రిలీజ్ ఇప్పుడు సస్పెన్స్ లో పడింది. థమన్ ఫ్రీ అయ్యి రాజాసాబ్ సెకండ్ సింగిల్ కూడా వదిలితే బావుంటుంది. అదే అభిమానులు మేకర్స్ పై ఒత్తిడి పెంచుతున్నారు. మరి మారుతి ఆ విషయంపై ఫోకస్ పెడితే బావుంటుంది.




జమైకా చిరుతనే దించుతున్నాడా
Loading..