నందమూరి నటసింహ బాలకృష్ణ ఫామ్ లోకి వచ్చాక ఏడాదికి రెండు సినిమాలు చొప్పున చేయడమే కాదు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టుకుంటూ వస్తున్నారు. సంక్రాంతికి ఓ సినిమా, ఆతర్వాత దసరా బరిలో మరో సినిమానీ విడుదల చేస్తూ అభిమానులకు కిక్ ఇస్తున్నారు. హరి బరిగా సినిమాలు చేసేసి ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చెయ్యడం లేదు.. పక్కా హిట్లు కొడుతున్నారు. అఖండ, వీర సింహ రెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, ఇప్పుడు అఖండ 2 తో సెప్టెంబర్ 25 న రాబోతున్నారు.
అఖండ 2 తాండవం చిత్రం విడుదలకు ముందే మరో సినిమాని లైన్ లో పెట్టేసారు. అది వీర సింహ రెడ్డి దర్శకుడు గోపీచంద్ మలినేని తో మరో పవర్ ఫుల్ యాక్షన్ మూవీని ఆయన తన బర్త్ డే సందర్భంగా మొదలు పెట్టారు. ఇప్పుడు క్రిష్ తో మరో సినిమాని లైన్ లో పెట్టారు. అది ఆదిత్య 999. మరి ఫిలిం ఫెడరేషన్ సభ్యులు ఆయన్ని మీటయినప్పుడు ఏడాది కి నాలుగు సినిమాలు చేస్తాను అని మాటిచ్చారు,
ఇలాంటి స్పీడు లో బాలయ్య ఏడాదికి నాలుగు సినిమాలు చేసేస్తారు. ఇప్పటికే ఏడాదికి రెండు అందిస్తున్నారు, ఇకపై మరో రెండు అందించినా ఆశ్చర్యపోవక్కర్లేదు అంటూ నందమూరి అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అన్నట్టు అఖండ 2 దసరా బరి నుంచి తప్పుకోవచ్చనే ఊహాగానాలు అఖండ 2 డబ్బింగ్ పూర్తి చేసి ఖండించారు బాలయ్య.