మెగాస్టార్ చిరంజీవి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో #Mega157 షూటింగ్ తో చాలా బిజీగా వుంటున్నారు. మరోపక్క ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తను పూర్తి చెయ్యాల్సిన సినిమాలను ఒక్కొక్కటిగా ఫినిష్ చేసుకుంటూ వెళుతున్నారు. అందులో భాగంగానే దర్శకుడు హరీష్ శంకర్ తో కలిసి ఆయన ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ని చకచకా పూర్తి చేస్తున్నారు.
తాజాగా దర్శకుడు హరీశ్ శంకర్, పవన్ కల్యాణ్‌పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఉస్తాద్ భగత్ సింగ్ సెట్‌లో అడుగుపెట్టారు. దానితో పవన్ కళ్యాణ్ సర్ ప్రైజ్ అయ్యారు. ఉస్తాద్ సెట్ లో పవన్ పక్కనే కూర్చుని, మానిటర్‌లో షాట్‌ను చూస్తున్న చిరంజీవి ఫొటో ఒకటి బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చాలా రోజుల తర్వాత ఇలా చిరు-పవన్ లు ఇద్దరూ ఇలా ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో మెగా అభిమానుల సంబరపడిపోతున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం నిమిషం తీరిక లేకుండా ఉస్తాద్ ని పూర్తి చేస్తూ ఉండగా, చిరు, అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ లో బిజీగా వున్న సమయంలో ఈ అన్నద్మముల అరుదైన కలయిక మాత్రం ట్రెండ్ అవుతుంది.