విశ్వంభర కూడా క్క్రిస్మస్ బరిలో?

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విడుదల తేదీపై దర్శకుడు వసిష్ట క్లారిటీ ఇవ్వకుండా కన్ఫ్యూజ్ చేస్తూనే ఉన్నారు. చిరు బర్త్ డే కి అయినా విశ్వంభర కు మోక్షం కలుగుతుంది అని ఎదురు చూసిన వారికి నిరాశే ఎదురైంది. మెగా ఫ్యాన్స్ కి ట్రీట్ అంటూ కేవలం విశ్వంభర OST తో సరిపెట్టారు. ఇక విశ్వంభర ఎట్టిపరిస్థితుల్లోనూ దసరా కు వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు.
ఒకవేళ నాగార్జున, బాలకృష్ణ మాదిరి విశ్వంభర కన్ను డిసెంబర్ పైన అందులోను క్రిస్మస్ ను టార్గెట్ చేస్తుందా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. మరి వశిష్ట త్వరగా సీజీ వర్క్ పూర్తి చేసి ఆ డేట్ లాక్ చేస్తారనే ప్రచారం మొదలైంది. నిజంగా అదే డేట్ లాక్ అయితే బాక్సాఫీసు ఫైట్ మాములుగా ఉండదు.
ఆ క్రిస్మస్ బాక్సాఫీసు పోటీలో ఇప్పటికే కింగ్ నాగార్జున తన 100 వ సినిమాని దించుతున్నట్టుగా అనౌన్స్ చెయ్యగా బాలయ్య NBK 111 చిత్రాన్ని అదే తేదికి దించే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. సెప్టెంబర్ 6 దానిపై క్లారిటీ రానుంది. ఈలోపే చిరు విశ్వంభర విడుదల తేదీ కూడా ఇస్తే ఆ క్రేజీ ఫైట్ కి ఆడియన్స్ అయోమయంలో పడాల్సిందే.







































