జగన్ కి హిత బోధ చేస్తున్న బ్లూ మీడియా

Jagan-Blue MediaJagan-Blue Media


మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెడితే.. ఆ ప్రెస్ మీట్ ని స్వీట్ అండ్ షార్ట్ గా ఆయన ముగించరు.. ల్యాగ్ చేస్తూ మీడియా వారికి కూడా చిరాకు తెప్పిస్తున్నారు, ఆ విషయంలో జగన్ మోహన్ రెడ్డి కాస్త ఆలోచించాలి అంటూ వైసీపీ పార్టీ కి వెన్ను దన్నుగా నిలిచే బ్లూ మీడియా నే జగన్ కు హిత బోధ చెయ్యడం గమనార్హం.

సీఎం గా ఉన్నపుడు మీడియాని పట్టించుకోని జగన్ ఇప్పుడు అసెంబ్లీ కి పోకుండా మీడియా వారిని పిలిచి ప్రెస్ మీట్ అంటూ చెప్పాల్సింది చెప్పకుండా ఏదో ఒకటి మట్లాడుతూ ప్రెస్ వాళ్ళను రెండుమూడు గంటలు కూర్చోబెట్టడం కరెక్ట్ కాదు, కాస్త వాళ్ళ మోర ఆలకించమంటూ బ్లూ మీడియా నే జగన్ కి చెబుతుంది.

మీడియా ముందు అధికార పక్షాన్ని విమర్శిస్తూ మాట్లాడే మాటలు వైసీపీ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది. ఏదో ఒక మేటర్ మీద మాట్లాడి వదిలేస్తే ఓకే, కానీ జగన్ ప్రెస్ మీట్ లో అనేక విషయాలు చర్చించడం మీడియా మిత్రులకు నచ్చడం లేదు, ఏంట్రా బాబు జగన్ మొదలెట్టాడంటే ఆపడంటూ కామెడీగా మాట్లాడుతున్నారు.

జగన్ ప్రెస్ మీట్ లో సూటిగా మాట్లాడి, అసలు సమస్య మీద మాట్లాడితే ఆ సమస్య నేరుగా ప్రజల్లోకి వెళుతుంది. అలా కాదు అని అనేక విషయాలు మాట్లాడితే అది చూసి ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అవుతారని బ్లూ మీడియా జగన్ కు హిత బోధ చేస్తుంది. 

Jagan Mohan Reddy