మోక్షజ్ఞ కి జోడిగా ఆ హీరోయిన్?
Sreeleela In Talks For Nandamuri Mokshagna's Debut Film
ఫైనల్లీ నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ కి ఇంట్రడ్యూస్ అయ్యే క్షణం ఆసన్నమైంది. బాలయ్య ఏరి కోరి ఎంచుకున్న ప్రశాంత్ వర్మ హ్యాండ్ ఇచ్చినా.. చివరికి బింబిసార దర్శకుడు వశిష్ట నందమూరి వారసుడు మోక్షజ్ఞ ను ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసే బాధ్యతను తీసుకున్నారు. మోక్షజ్ఞ-వశిష్ట -మైత్రి మూవీ మేకర్స్ మూవీ అఫీషియల్ అనౌన్సమెంట్ వచ్చేసింది.
మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో మోక్షు కి జోడిగా నటించే హీరోయిన్ విషయంలో విపరీతమైన ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తుంది. అయితే గతంలో బాలయ్య భగవంత్ కేసరిలో నటించిన శ్రీలీల ని మోక్షు సరసన మొదటి సినిమాలో నటిస్తుంది అనే ప్రచారం జరిగింది. మరోసారి శ్రీలీల పేరు మోక్షజ్ఞ డెబ్యూ చిత్రం విషయంలో తెరపైకి వచ్చింది.
శ్రీలీల మోక్షు సరసన నటిస్తుంది అనే ప్రచారం జరుగుతుంది. అయితే మోక్షజ్ఞ సరసన ప్లాప్ హీరోయిన్ కి అవకాశం ఇస్తారా.. వరస వైఫల్యాలతో సతమతమవుతూ.. టాలీవుడ్ కి దూరమవుతున్న సమయంలో శ్రీలీల పేరు మోక్షజ్ఞ సరసన వినిపించడం కొంతమందికి నచ్చినా మరికొంతమందికి మాత్రం నచ్చడం లేదు. ప్లాప్ హీరోయిన్ తో మోక్షజ్ఞ జత కట్టడం అభిమానులకే ఇష్టంగా అనిపించడం లేదు.







































