కొండా సురేఖను బర్తరఫ్ చేసిన సీఎం

Konda Surekha Removed from CabinetKonda Surekha Removed from Cabinet


ఫైనల్ గా కొండా సురేఖను మంత్రి పదవి నుంచి కాంగ్రెస్ అధిష్టానం తప్పించింది. మంత్రి పదవి నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేయాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ హై కమాండ్ ఆదేశించింది. దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్న కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలిగించేందుకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ఆమెను బర్తరఫ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.

గౌరవంగా కొండా సురేఖ ను తన పదవికి రాజీనామా చెయ్యమన్న కాంగ్రెస్ పెద్దల నిర్ణయాన్ని సురేఖ వ్యతిరేఖించడమే కాదు సీఎం రేవంత్ రెడ్డిని మళ్లీ మళ్లీ టార్గెట్ చెయ్యడంతో కాంగ్రెస్ అధిష్టానం కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించింది. సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు అధికారికంగా సిఫారసు లేఖను పంపించారు.

మరోనేత చిన్నారెడ్డి పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన కారణంగా ఆయనపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వేటు వేసింది. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పదవి నుంచి చిన్నారెడ్డిని తొలిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Konda Surekha Bartaraf From Cabinet