ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Taapsee sensational comments on Bollywood

బాలీవుడ్‌పై తాప్సీ సంచలన వ్యాఖ్యలు!

Taapsee sensational comments on BollywoodTaapsee sensational comments on Bollywood

బాలీవుడ్ వర్సటైల్ నటి తాప్సీ  పరిశ్రమలోని రచయితలు, దర్శకుల మూస ఆలోచనా ధోరణిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  సీరియస్ రోల్స్ ..ఉమెన్ సెంట్రిక్ థ్రిల్లర్ చిత్రాలతో నటిగా ప్రత్యేక ముద్ర వేసిన తాప్సీ తనకు  మంచి రొమాంటిక్ కామెడీ  సినిమాలో నటించాలని ఉందనే కోరికను బయటపెట్టారు. అయితే పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న సృజనాత్మక దివాళా తీత వల్ల దర్శక నిర్మాతలు తనను  అందమైన ప్రేమకథలో ఊహించు కోలేకపోతున్నారని  మండిపడ్డారు.

తనకు రొమాంటిక్ కథలంటే ఎంతో ఇష్టమని కానీ బాలీవుడ్‌లో నాణ్యమైన ప్రేమకథా చిత్రాల కొరత తీవ్రంగా ఉందని తాప్సీ ఆవేదన వ్యక్తం చేశారు. `ప్రజలు, పరిశ్రమ వర్గాలు నన్ను కేవలం పోరాటాలు చేసే పాత్రల్లో లేదా తీవ్రమైన కేసులను ఛేదించే క్యారెక్టర్లలోనే చూడటానికి అలవాటు పడిపోయారు. నన్ను పక్కా లవ్ స్టోరీలో ఊహించుకోవడంలో వారు విఫలమవుతున్నారు` అని  పేర్కొన్నారు. గతంలో తక్కువ బడ్జెట్‌తో వచ్చిన రొమాంటిక్ సినిమాలు సైతం మంచి విజయాన్ని సాధించాయని.. కానీ నేడు అలాంటి ఫ్రెష్ కథలు రాకపోవడం విచార‌క‌ర‌మ‌న్నారు.

యాక్షన్ - థ్రిల్లర్ చిత్రాలలో నటించి అలసిపోయిన తనకు  తేలికపాటి మనస్సుతో హాయిగా నవ్వుకునేలా ఉండే రొమాంటిక్ కామేడీ సినిమాల్లో నటించడమే తదుపరి ప్రాధాన్యత అని తాప్సీ క్లారిటీ ఇచ్చేసారు. మంచి ప్రేమకథ దొరికితే తప్పకుండా చేస్తానని.. పరిశ్రమలో సరికొత్త ఆలోచనలతో వచ్చే రచయితలు రొమాంటిక్ జానర్‌ను తిరిగి పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Taapsee