ఈరోజే విద్యార్థుల ఖాతాలోకి తల్లికి వందనం
Thalliki Vandanam Scheme
ఏపీ ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చినట్టుగానే సూపర్ సిక్స్ పథకాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రతి పథకాన్ని లబ్దిదారులకు చేరేలా చర్యలు తీసుకుంటుంది. దీపం పథకం దగ్గర నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం వరకు ఏ పథకాన్ని ఆపకుండా అమలు చేస్తుంది. అందులో భాగంగా ఈరోజు తల్లికి వందనం పథకం కింద అర్హత సాధించిన ప్రతి విద్యార్థికి రూ.15,000 చొప్పున నేరుగా వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.
ఈరోజు జులై 22 నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ విడతలో మొత్తం 67,47,190 మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు, అందుకోసం ప్రభుత్వం భారీ స్థాయిలో ₹10,091 కోట్ల నిధులను విడుదల చేసింది. తల్లికి వందనం పథకం ద్వారా లక్షలాది కుటుంబాలకు ఆర్థిక ఊరట లభిస్తుంది.
తల్లికి వందనం పథకం కింద ప్రభుత్వం రూ.15వేలు అందజేస్తుండగా.. అందులో రూ.13వేలు విద్యార్థుల సంరక్షకులైన వారి తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేయనుండగా.. మిగతా రూ.2వేలను ఆ విద్యార్థులు చదువుతున్న పాఠశాల అకౌంట్‌లో జమచేయనుంది. తొలి విడతలో భాగంగా ఇప్పటికే స్కూల్‌లో చదువుతున్న విద్యార్థుల తల్లుల అకౌంట్‌లో నిధులు జమ చేయనుండగా.. ఇక రెండో విడత కింద ఈ ఏడాది కొత్తగా చేరిన విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింప చేయనున్నారు.








































