ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Prabhas Joins Hands With Scene Director

సీన్ డైరెక్టర్ తో ప్రభాస్!

Prabhas Joins Hands With Scene DirectorPrabhas Joins Hands With Scene Director

 

ఏ భాష లో అయినా ఓ దర్శకుడు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా, హిట్ కొట్టినా ఆ దర్శకుడితో పాన్ ఇండియా స్టార్స్ సినిమాలు చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తుంటాయి అవేమి రూమర్స్ అని చెప్పలేం, ఎందుకంటే ఆ దర్శకులను ఆ హీరోలు ఏదో ఒక సందర్భంలో మీటవుతూనే ఉంటారు అందుకే చాలా ఫాస్ట్ గా ఆ దర్శకులు-హీరోలు కలిసి సినిమాలు చేస్తున్నారనే వార్తలు పుట్టుకోస్తాయి.

ఈమధ్యనే కోలీవుడ్ హీరో సూర్య తో మంచి హిట్ కొట్టిన మలయాళ డైరెక్టర్, సీన్ డైరెక్టర్ జీతూ మాధవన్ తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా ఉండబోతుంది.. అది కూడా ఎక్సక్లూజివ్ అంటూ కొంతమంది వార్తలు రాస్తున్నారు. గతంలోనూ మలయాళ దర్శకులతో ప్రభాస్ సినిమా ఉండొచ్చనే ఊహాగానాలు నడిచాయి.

ఇప్పుడు సీన్ డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా అంటున్నారు. అందులో నిజం ఎంతుందో తెలియదు కానీ. ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్, ఫౌజీ, కల్కి 2 షూటింగ్స్ లో గజిబిజిగా వున్నారు. తర్వాత సలార్ 2, ప్రశాంత్ వర్మ మూవీ అబ్బో చాలానే లైన్ ఉంది ప్రభాస్ చెయ్యబోయే చిత్రాలు సంఖ్య. మరి సీన్ దర్శకుడితో ప్రభాస్ సినిమా ఎప్పుడు ఉంటుందో అనేది చూడాలి. 

Prabhas is reportedly set to collaborate with Malayalam filmmaker Jithu Madhavan