ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss contestant Rohit Naidu criticizes Nagarjuna

నాగ్ నే విమర్శిస్తున్న బిగ్ బాస్ రోహిత్

Bigg Boss contestant Rohit Naidu criticizes NagarjunaBigg Boss contestant Rohit Naidu criticizes Nagarjuna

 

ప్రస్తుతం నడుస్తున్న బిగ్ బాస్ సీజన్ 10 లో అగ్నిపరీక్ష2 తో హౌస్ లోకి కామనర్ గా ఎంటర్ అయిన రోహిత్ నాయుడు.. త్రిగుణ ని టార్గెట్ చేసే క్రమంలో ఆట వదిలేసి, షాలిని తో చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు. షాలిని ని దూరం పెట్టమని వైల్డ్ కార్డులు చెప్పినా వినలేదు, వైల్డ్ ఫైర్స్ వచ్చి షాలిని ని వదలమన్నా వదల్లేదు, దెబ్బకు హౌస్ మేట్స్ కి టార్గెట్ అయ్యి ఎలిమినేట్ అయ్యాడు.

హౌస్ లో పదే పదే త్రిగుణ ని టార్గెట్ చేసిన రోహిత్ బయటికొచ్చాక ప్రెస్ మీట్ పెట్టి త్రిగుణ ని మళ్లీ మళ్ళీ టార్గేట్ చెయ్యడమే కాదు కిస్సిక్ టాక్ షో లో రోహిత్ బిగ్ బాస్ ని, నాగార్జున నే విమర్శించడం హాట్ టాపిక్ అయ్యింది. హౌస్ లో చాలా జరుగుతున్నాయి.. త్రిగుణ బూతులు మాట్లాడిన అది బయటకు రాదు, షాలిని F *వర్డ్ అంది అని పాయింట్ అవుట్ చేసారు.

దేబ్జానీ 2 ఫేస్, రాంప్రసాద్ కన్నింగ్, గుంటనక్క అన్న రోహిత్ ముఖేష్ ని దేబ్జాని చాలా అంటుంది, తెలుగు రాదు అంటుంది, కానీ మాట్లాడ కూడనివి అన్ని మాట్లాడుతుంది. ముఖేష్ నాగ్ సర్ ని ఓ వీడియో అడిగితె నాగ్ సర్ ఫోన్ చేసి టీమ్ ని ఆ వీడియో అడిగారు వాళ్ళు వెతికి లేదు అన్నారు.

అంటే నాగార్జున సర్ స్క్రిప్ట్ ఫాలో అవుతారా, టీమ్ చెప్పింది చేస్తారా అని యాంకర్ వర్ష అడిగితె...నాగార్జున సర్ ది ఫేస్ మాత్రమే, టీమ్ మొత్తం చూసుకుంటుంది.. టీమ్ ఏది చెబితే అదే నాగ్ సర్ చెబుతారు అంటూ రోహిత్ నాయుడు బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున నే విమర్శిస్తూ కామెంట్స్ చెయ్యడం నాగ్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. 

Bigg Boss Season 10: Rohit Naidu criticizes Nagarjuna
O.M Review
O.M Review
27 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
27 Nov 2026
DNK Review
DNK Review
27 Nov 2026
GOAT Review
GOAT Review
27 Nov 2026
Scene Review
Scene Review
27 Nov 2026
Ramayana Review
Ramayana Review
27 Nov 2026