ఈ ఏడాది మోక్షు ఎంట్రీ లేనట్టే!

Mokshagna should wait till that timeMokshagna should wait till that time

 

నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం కోసం నందమూరి ఫ్యాన్స్ ఎదురు చూసినట్టుగా ఇంతవరకు ఏ వారసుడు కోసం ఆయా హీరోల అభిమానులు వెయిట్ చెయ్యలేదేమో.. గత రెండేళ్లుగా మోక్షజ్ఞ హీరోగా పరిచయమవుతున్నాడు అంటూ అధికారిక వార్తలు రావడం, ఆపై ఆ వార్తలు కేవలం వార్తలుగానే మిగిలిపోవడం చూస్తున్నాం.

ప్రశాంత్ వర్మ తో మోక్షజ్ఞ మూవీ అనౌన్సమెంట్ తోనే ఆగిపోయింది. తర్వాత దర్శకుడు వశిష్ట మోక్షజ్ఞ ను ఇంట్రడ్యూస్ చేసే బాధ్యతను తీసుకున్నారు. ఆ చిత్రం అనౌన్సమెంట్ వచ్చి కూడా నెలలు గడుస్తున్నాయి. వసిష్ఠ మోక్షజ్ఞ తో చేయబోయే చిత్రాన్ని భారీ సోషియో-ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో, మల్టిపుల్ టైమ్‌లైన్స్, పునర్జన్మలు, భారీ విఎఫ్ఎక్స్ వంటి అంశాలతో రూపొందించనున్నట్లు ప్రచారం జరుగుతుంది.

ఈ చిత్రంలో బాలయ్య కూడా నటిస్తారనే వార్తలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను జనవరి మూడో వారం నుంచి ప్లాన్ చేస్తున్నారని టాక్. అంటే ఈ ఏడాది మోక్షజ్ఞ సెట్ పైకి వెళ్లే ఛాన్స్ లేదు అని తెలుస్తుంది. ఇక ఫస్ట్ షెడ్యూల్ లో దర్శకుడు వశిష్ట హీరో పై కొన్ని కీలక సన్నివేశాలు తీయనున్నారు అని ప్రస్తుతం దర్శకుడు వశిష్ఠ స్క్రిప్ట్ ఫైనల్ డ్రాఫ్ట్ పై దృష్టి పెట్టారని టాక్.

Will Mokshagna make his Debut in 2026?
O.M Review
O.M Review
27 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
27 Nov 2026
DNK Review
DNK Review
27 Nov 2026
GOAT Review
GOAT Review
27 Nov 2026
Scene Review
Scene Review
27 Nov 2026
Ramayana Review
Ramayana Review
27 Nov 2026