భోగి ట్విట్టర్ టాక్
Bhogi Social Medi talk
శర్వానంద్-సంపత్ నంది ల కలయికలో తెరకెక్కిన భోగి చిత్రం రెండు వారాల క్రితమే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. కొన్ని కారణాలతో ఈ చిత్రం నేడు నవంబర్ 27 న విడుదలైంది. భోగి ప్రమోషన్స్ లో హీరోయిన్ డింపుల్ హయతి తో శర్వానంద్ మూవ్ అయిన వీడియోస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవడం, భోగి ప్రమోషన్స్ అన్ని సినిమాపై ఆడియన్స్ లో ఆసక్తిని క్రియేట్ చేసాయి.
భోగి ఓవర్సీస్, ప్రీమియర్స్ షోస్ పూర్తి కావడంతో ఆడియన్స్ భోగి పై ప్రేక్షకులు స్పందించారు. భోగి ట్విట్టర్ టాక్ లోకి వెళితే.. శర్వానంద్ మేకోవర్, పవర్‌ఫుల్ మాస్ నటనతో ఆకట్టుకోగా.. యాక్షన్ సన్నివేశాలు, క్లైమాక్స్ ట్విస్ట్ బావున్నాయి. కానీ ఫస్ట్ హాఫ్ సహనానికి పరీక్ష, సెకండ్ పూర్తిగా గాడి తప్పింది అంటూ ప్రేక్షకులు స్పందిస్తున్నారు.
అతి రక్తపాతం, హింసాత్మక సన్నివేశాలు చిరాకు పెట్టిస్తాయి. రొటీన్ స్టోరీ, ఒక్క పాట కూడా ఎక్కదు, BGM అయితే చెవులు చిల్లులు పడేలా ఉంది, శర్వానంద్ నటన బావుంది, ఆయన యాక్షన్ సీక్వెన్స్ లో ఎనేర్జిగా కనిపించారు, సినిమాకి ప్రధాన బలం శర్వానంద్, కానీ భోగి చూస్తుంటే రంగస్థలమే గుర్తుకువస్తుంది. కానీ రంగస్థలంలా భోగి లో అంత ఇంపాక్ట్ లేదు.. ఆ విషయంలో దర్శకుడు సంపత్ నంది పూర్తిగా విఫలమయ్యారు.
భోగి లో మాస్ గా శర్వానంద్ ఆకట్టుకున్నారు తప్ప సినిమాలో చెప్పుకోవడానికి ఏమి లేదు అంటూ ఆడియన్స్ తేల్చేస్తున్నారు. మరి భోగి చిత్రం ఫైనల్ గా ఎలా ఉందొ పూర్తి సమీక్షలో మరికాసేపట్లో..















































