ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Esha Deol on Dharmendra and Hema Malini's parenting

మాకు వాళ్లు స్టార్లు కాదు.. అమ్మ, నాన్న మాత్రమే!

Esha Deol on Dharmendra and Hema Malini's parentingEsha Deol on Dharmendra and Hema Malini's parenting

`ప్రతాప్` సినిమాకు మంచి స్పందన వస్తున్న వేళ ఈషా డియోల్ పెంపకం గురించి ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పారు. ధర్మేంద్ర, హేమమాలిని లాంటి పెద్ద స్టార్ల ఇంట్లో పెరిగినా? చిన్నప్పటి నుంచి వాళ్లను తాను కేవలం తల్లిదండ్రులుగానే చూసేదాన్ని అన్నారు. సినిమాల్లో వాళ్లకున్న ఇమేజ్ కంటే ఇంట్లో నేర్పిన విలువలు, మనం ఏ దశలో ఉన్నామనే విషయమే తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయన్నారు.

మరోవైపు ధర్మేంద్రను తలుచుకుంటూ హేమమాలిని కూడా గతంలో పంచుకున్న జ్ఞాపకాలు మళ్లీ చర్చలోకి వచ్చాయి. ఆయన లేని లోటు తీర్చలేనిదని.. కెరీర్‌లో తనకు అండగా నిలిచిన బలమైన స్తంభం ఆయనేనని హేమ భావోద్వేగానికి లోనయ్యారు. పెళ్లయ్యాక కూడా సినిమాలను.. నాట్యాన్ని ఆపొద్దంటూ ధర్మేంద్ర ఎప్పుడూ ప్రోత్సహించేవారని ఇంట్లో కూర్చోమని ఎప్పుడూ అనలేదని  గుర్తుచేసుకున్నారు.

`కోయి మేరే దిల్ సే పూఛే`తో తెరంగేట్రం చేసిన ఈషా డియోల్.. ధూమ్, యువ, కాల్, దస్ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. సినిమాలతో పాటు రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్ లాంటి వెబ్ సిరీస్‌లలోనూ నటించారు. భరత్ తఖ్తానీతో వివాహం తర్వాత కొంతకాలం బ్రేక్ తీసుకున్నా.. మళ్లీ తనదైన శైలిలో ప్రాజెక్టులతో ముందుకు సాగుతూనే ఉన్నారు.
 

Esha Deol talks about Dharmendra, Hema Malini
O.M Review
O.M Review
26 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
26 Nov 2026
DNK Review
DNK Review
26 Nov 2026
GOAT Review
GOAT Review
26 Nov 2026
Scene Review
Scene Review
26 Nov 2026
Ramayana Review
Ramayana Review
26 Nov 2026