ఆకాశంలో ఒక తారపై మెగాస్టార్ రివ్యూ
Megastar's review on Aakasamlo Oka Tara
దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి కలయికలో పవన్ సాధినేని తెరకెక్కించిన ఆకాశంలో ఒక తార గత శుక్రవారం విడుదలై ఆడియన్స్ నుంచి క్రిటిక్స్ నుంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని వీక్షించిన మెగాస్టార్ సోషల్ మీడియా వేదికగా..
#AakasamloOkaTara సినిమా చూశాను. నా మనసును ఎంతో కదిలించిన చిత్రం ఇది. ఇంత స్ఫూర్తిదాయకమైన కథను ఎంతో నమ్మకంతో, అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు @pavansadineni ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా సెకండాఫ్ అంతా ఎంతో భావోద్వేగానికి లోనయ్యాను. @dulQuer, @satveeravalli తమ సహజమైన నటనతో పాత్రలకు ప్రాణం పోశారు.
@shrutihaasan, @iRuhaniSharma తో పాటు నటీనటులందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
@gvprakash సంగీతం, @sujithsarang అద్భుతమైన ఛాయాగ్రహణం కథలోని భావోద్వేగాలను మరింతగా మనసుకు హత్తుకునేలా చేశాయి. ప్రతి సాంకేతిక విభాగం పనితీరు ప్రశంసనీయం. తల్లిదండ్రులందరూ తప్పకుండా మీ పిల్లలతో కలిసి ఈ సినిమా చూడండి. ఈ కథ వారిలో గొప్ప స్ఫూర్తిని నింపుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.
ప్రొడ్యూసర్స్ స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్, లైట్ బాక్స్ మీడియా సంస్థలకు, చిత్ర బృందం మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు! 👏💐@GeethaArts, @SwapnaCinema, @Lightboxoffl
















































