BB10: నోటి దూల తగ్గించుకుంటే త్రిగుణే విన్నర్!
Bigg Boss 10: Thrigun losing top spot due to his loose tongue
బిగ్ బాస్ సీజన్స్ లో ఇప్పటివరకు ఎవరూ చూడని వ్యక్తి ఈ సీజన్ 10 ని రూల్ చేస్తున్నాడు. అతనే త్రిగుణ్. బిగ్ బాస్ సీజన్ లో రెండో వారం నుంచే తన పవర్ చూపిస్తున్నాడు. టాస్క్, మిగతా ఏ విషమైనా త్రిగుణ్ కనబడాల్సిందే. అంతెందుకు హౌస్ లో ఏ మూల ఉన్నా త్రిగుణ్ కంటెంట్ ని బిగ్ బాస్ చూపిస్తున్నాడు. ప్రతి ఒక్కరితో గొడవ, నమ్మినోళ్ళని గొంతు కోస్తాడు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు.
ముఖ్యంగా మానిప్యులేటర్, జరగబోయేది ముందే ప్రెడిక్ట్ చేస్తాడు. అదే అతన్ని అందరూ ఇష్టపడడానికి కారణం అయ్యింది. టాస్క్ లో త్రిగుణ్ పాచిక వేసాడు అంటే అది పారాల్సిందే. హౌస్ మేట్స్ సపోర్ట్ టాస్క్ లో త్రిగుణ్ గేమ్ చేంజర్. ఇది ఎవ్వరూ ఒప్పుకోకపోయినా అదే నిజం. కానీ హౌస్ మేట్స్ మాత్రం ఒప్పుకోరు. వాళ్ళ ఫ్యామిలీస్ చెప్పినా అదే డౌట్ వాళ్ళలో.
అయితే ఇంత మంచి గ్రాఫ్ ఉన్న త్రిగుణ్ లో ఉన్న ఒకే ఒక్క బ్యాడ్ గుణం. నోటి దూల. అన్ని గొడవల్లో తానే ఉండాలి, కంటెంట్ ఇవ్వాలనే తపనతో త్రిగుణ్ నోరు జారడం, వీకెండ్ ఎపిసోడ్ లో హోస్ట్ ముందు సారీ చెప్పడమనేది కామన్ అయ్యిపోయింది. మాట్లాడు, పోట్లాడు కానీ నోరు జారకు అని ఎంతమంది చెప్పినా సరే అంటాడు.
కానీ అగ్రెసివ్ అయ్యాడా, నోటికి ఎంతమాట వస్తే అంత మాట మాట్లాడతాడు. ట్రిగ్గర్ చేస్తాడు, అంతకుమించి ట్రిగ్గర్ అవుతాడు. త్రిగుణ్ నిజంగా ఆ నోటి దూల తగ్గించుకో, తీట తగ్గించుకో.. నువ్వే సీజన్ 10 విన్నర్, లేదంటే ఈ మూడు వారాల్లో గేమ్ మారి నువ్వు సెకండ్ ప్లేస్ కి పడిపోతావ్ అంటూ ఆయన అభిమానులు రిక్వెస్ట్ చేస్తున్నారు.
















































