లేడీ కలెక్టర్ పై విజయ్ టీవీకే ఎమ్మెల్యే కన్ను
FIR registered against TVK MLA
తమిళనాట విజయ్ టీవీకే పార్టీ ఎమ్మెల్యే కళ్లకురిచ్చి జిల్లా కలెక్టర్‌కు అసభ్య మెసేజ్‌లు పంపించిన ఘటన హాట్ టాపిక్ గా మారింది. టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్ మహిళా కలెక్టర్ పద్మజకు అసభ్య మెసేజ్‌లు పంపారనే ఆరోపణలు వెల్లువెత్తడమే కాదు.. ఆయనపై కేసు నమోదు చేసిన ఘటన విజయ్ టీవీకే పార్టీకి మచ్చతెచ్చేలా ఉంది.
కళ్లకురిచ్చి మహిళా కలెక్టర్ పద్మజ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్ అరెస్ట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, ఎమ్మెల్యే వ్యవహారంపై మద్రాస్ హైకోర్టు సీరియస్ అయ్యింది. అంతేకాదు ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్ కేసుపై ఐజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో దర్యాప్తునకు హైకోర్టు ఆదేశం జారీ చేసింది.
లైంగిక వేధింపుల నుంచి మహిళలకు రక్షణ కల్పించాలి అంటూ హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చెయ్యడమే కాదు.. తప్పు చేసిన ఎమ్యెల్యేను కాపాడుతున్నారంటూ విజయ్ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసింది.
















































