మెగా వారసురాలు ఫస్ట్ డే స్కూల్ మూమెంట్స్
Ram Charan and Upasana Enroll Their Daughter Klin Kaara in Pre School
మెగా వారసురాలు రామ్ చరణ్ కుమార్తె క్లింకార కొణిదెల మొదటిరోజు స్కూల్ వీడియో వైరల్ అవుతుంది. కొన్నేళ్లుగా ఇంట్లోనే తల్లితండ్రుల సమక్షంలో పెరిగిన పిల్లలు మొదటిరోజు కొత్త ప్రపంచంలోకి వెళ్లేందుకు ఇష్టపడరు. ప్రతి పేరెంట్స్ ఫేస్ చేసేదే ఇది. పిల్లలను బుజ్జగించి స్కూల్ కి పంపేందుకు తల్లితండ్రులకు తల ప్రాణం తోకకు వస్తుంది.
ఈరోజు కార్తీక పౌర్ణమి, గురు నానక్ జయంతి సందర్భంగా మెగాస్టార్ మనమరాలు క్లింకార ను ప్రీ స్కూల్ లో జాయిన్ చేసారు రామ్ చరణ్, ఉపాసన జంట. ఏ స్కూల్ లో చేర్పించారో తెలియదు కానీ ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో క్లింకార చాలా క్యూట్ గా అల్లరి చేస్తూ స్కూల్ కి పోను అంటూ గారాలు పోతున్నట్టుగా ఉంది.
రామ్ చరణ్, ఉపాసన దగ్గరుండి తమ కుమార్తెను స్కూల్ కి తీసుకొచ్చారు. క్లింకార మాత్రం గెంతుతూ తల్లి చెయ్యి పట్టుకుని స్కూల్ లో కనిపించింది.
















































