సంక్రాంతికి విశ్వంభర ఫిక్స్?
Vishwambhara set for Sankranti 2025 release
మెగాస్టార్ చిరంజీవి నుంచి రావాల్సిన విశ్వంభర ఎప్పుడు వస్తుంది, అనేది పెద్ద ప్రశ్నగా తయారైంది. దర్శకుడు వశిష్ట సీజీ వర్క్ కంప్లీట్ చేసి రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. విశ్వంభరను సంక్రాంతికి తెస్తే ఎంతో కొంత సేవ్ అవుతుంది, ఇప్పటికే సినిమాపై హైప్ తగ్గిపోయింది, అందుకే సంక్రాంతి స్లాట్ అయితే విశ్వంభర బయటపడిపోతుంది అని వశిష్ట ఇంకా నిర్మాతలు భావిస్తున్నారు.
విశ్వంభర విడుదలకు చిరు కాక అడ్డుపడుతుంది. కాక కూడా సంక్రాంతికే విడుదల అవుతూ ఉండడంతో విశ్వంభర విడుదల విషయం కన్ఫ్యూజన్ లో పడింది. కానీ ఇప్పుడు విశ్వంభర కు లైన్ క్లియర్ అయ్యింది, సంక్రాంతికే విశ్వంభర విడుదల అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అదే సంక్రాంతి డేట్ ని విశ్వంభర ట్రైలర్ తో రివీల్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని సమాచారం. గత మూడేళ్ళుగా సెట్ పై ఉన్న విశ్వంభర కు ఫైనల్ గా ఈ సంక్రాంతికి మోక్షం కలుగుతుందేమో చూడాలి.
















































