పవన్ ని రెచ్చగొడుతున్నా పని జరగట్లేదు!
Blue media is provoking Pawan Kalyan
ఎలాగైనా కూటమి లో ఉన్న పార్టీలను బ్రేక్ చెయ్యాలి, ఆ మూడు పార్టీలను విడగొట్టాలని వైసీపీ పార్టీ దానికి తోక బ్లూ మీడియా చాలా ట్రై చేస్తున్నాయి. మేయర్, ఎంపీటీసీ, జెడ్పిటీసి ఎన్నికల్లోనే టీడీపీ నుంచి జనసేన ను వేరు చెయ్యాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను చాలా రెచ్చగొట్టారు.
బీటలు వారుతున్న టీడీపీ-జనసేన స్నేహం, జనసేన కార్యకర్తలను టీడీపీ కార్యకర్తలు కొడుతున్నా పవన్ లో చలనం లేదు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు కి సలాం కొడుతున్నారు, పవన్ కళ్యాణ్ కార్యకర్తలను విస్మరిస్తున్నారు. కూటమి మైత్రి కోసం పవన్ తన సేనను లైట్ తీసుకుంటున్నారంటూ బ్లూ మీడియా రెచ్చగొట్టింది.
కూటమిలో ఉన్నప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి, మనస్పర్థలు ఉంటాయి. కానీ వాటిని సరి చేసుకుంటామని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చెప్పడంతో వైసీపీ కి అలాగే బ్లూ మీడియా కి దిమ్మ తిరిగింది. ఇప్పుడు పంచాయితీ ఎలక్షన్ లోను పవన్ కళ్యాణ్ తన కార్యాకర్తలకు అన్యాయం చేస్తున్నారు, తన పార్టీ నేత ని చంపేసినా పవన్ మౌనం వహిస్తున్నారంటూ మళ్ళీ మళ్ళీ పవన్ ని రెచ్చగొడుతుంది.
జనసేన చావుకొచ్చిన పవన్ బలహీనత, చంద్రబాబు, టీడీపీ నుంచి విడిపోయేందుకు పవన్ ఒప్పుకోవడం లేదు.. అందుకే కార్యకర్తలు ఏమైపోయినా పవన్ పట్టించుకోవడం లేదు అంటూ ఈసారి కేడర్ ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది బ్లూ మీడియా. కానీ పవన్ మాత్రం తన పార్టీని, పార్టీ కార్యకర్తలకు నచ్చజెప్పుకుంటూ, టీడీపీ తో దోస్తికే ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
















































