ఈజీగా రూ.100 కోట్ల క్లబ్బులోకి!
Dhanush O.M enters !00 cr club
ఈమధ్యన తమిళంలో విడుదలవుతున్న సినిమాలు విడుదల రోజు మిక్స్డ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటున్నాయి కానీ.. వారం తిరిగేలోపే రూ.100 కోట్ల క్లబ్బులోకి ఈజీగా ఎంటర్ అయ్యి అందరికి షాకిస్తున్నాయి. సూర్య కరుప్పు తెలుగులో బాలేదనన్నారు. కానీ కరుప్పు వీరభద్రుడిగా మంచి కలెక్షన్స్ రాబట్టింది.
కరుప్పు చాలా తర్వాతగానే రూ.100 కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టింది. ఇక నిన్నగాక మొన్న సూర్య సీన్ చిత్రానికి సేమ్ టాక్ వచ్చింది. అసలు తెలుగులో సీన్ ఆడదు అనుకున్నారు, తమిళనాట కూడా సూర్య సీన్ చిత్రానికి జస్ట్ యావరేజ్ టాక్ వచ్చింది. కానీ ఈ చిత్రానికి రూ.100 కాదు రూ.250 కోట్లు వచ్ఛాయి.
ఇప్పుడు ధనుష్ ఓ.ఎం చిత్రం కూడా అంతే. తెలుగు, తమిళం రెండు చోట్ల ఓ.ఎం చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ కనిపించింది. ధనుష్ ఓ.ఎం చిత్రం ఫస్ట్ వీకండ్ లోనే రూ.100 కోట్ల క్లబ్బులోకి చేరడం చూసి యావరేజ్ టాక్ తోనే తమిళ చిత్రాలు ఈజీగా రూ.100 కోట్ల క్లబ్బులోకి ఎంటరైపోతున్నాయని ప్రేక్షకులే కాదు ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి.
















































