లాస్ట్ మినిట్ వాయిదాలు - దేనికి సంకేతం
Last-minute postponement due to Censor problem?
మరో వారంలో సినిమా రిలీజ్ అనగా ఇప్పుడు సినిమాలను వాయిదా వెయ్యడం అనేది ఈమధ్య కాలంలో తరుచు వినిపిస్తున్న వార్తలు. భోగి చిత్రం వారం ముందు వాయిదాపడి మళ్ళీ ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. ఇక రేపు శుక్రవారం విడుదల కావాల్సిన రెండు సినిమాలు చివరి నిమిషంలో వాయిదా పడ్డాయి.
అయితే ఇలా చివరి నిమిషంలో వాయిదా వెనుక సెన్సార్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనే మాట వినిపిస్తుంది. విడుదల తేదీ చెప్పి దానికి అనుగుణంగా ప్రమోషన్స్ స్టార్ట్ చేసాక సినిమాలు వాయిదా పడుతున్నాయి. మొన్న భోగి ఇప్పుడు హైందవ, మైసా ఈ రెండు చిత్రాలు అలానే జరిగాయి.
ఇక డిసెంబర్ 4న విడుదలకు సిద్దమవుతున్న నాగ చైతన్య వృషకర్మ పై అప్పుడే వార్తలు స్టార్ట్ అయ్యాయి. వృషకర్మ కూడా సెన్సార్ పాస్ అయితేనే విడుదల లేదంటే సమయం కావాలి అంటున్నారు. నాగ చైతన్య చూస్తే వృషకర్మ ను తెగ ప్రమోట్ చేస్తున్నాడు. మామూలుగానే ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి.
ఇలా ప్రమోషన్స్ తో ప్రేక్షకుల్లోకి వెళ్ళాక వాయిదాలు అనేది కరెక్ట్ కాదు. కానీ సెన్సార్ బోర్డు మాత్రం ఈ విధమైన రూల్స్ పెట్టి ప్రేక్షకులను, మేకర్స్ ఇద్దరిని అయోమయానికి గురి చేస్తుంది.
















































