`దురంధ‌ర్‌`ని టార్గెట్ చేస్తున్న హీరో

Ranbir Kapoor targeting DhurandharRanbir Kapoor targeting Dhurandhar

ర‌ణ్‌వీర్ సింగ్- ఆదిత్యాధ‌ర్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన దురంధ‌ర్ ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టించిందో తెలిసిందే. రెండు భాగాలుగా వ‌చ్చిన ఈ ఫ్రాంఛైజీ ఏకంగా 3000 కోట్లు వ‌సూలు చేసింది. ఆ త‌ర్వాత అంద‌రి దృష్టి మ‌రోసారి స్పై యూనివ‌ర్శ్ ల‌పై ప‌డింది. ఇందుకు ప్ర‌ఖ్యాత టీసిరీస్ మిన‌హాయింపు కాదు. ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క బ్యానర్ లో ఇప్పుడు స్పై యూనివ‌ర్శ్ కాన్సెప్ట్ తో ఓ భారీ యూనివ‌ర్శ్ తెర‌కెక్క‌బోతోంది. ఇందులో అజ‌య్ దేవగ‌న్ హీరో.

తానాజీ, దృశ్యం 2, రైడ్ 2 వంటి వరుస హిట్లతో  దూసుకెళ్లిన‌ అజయ్ దేవగన్- టీసిరీస్ భూషణ్ కుమార్ జోడీ ధురంధర్ స్థాయిలో మరో భారీ స్పై థ్రిల్లర్‌కు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు భారతీయ వెండితెరపై చూడని ఒక వినూత్న గూఢచార కథాంశంతో భూషణ్ కుమార్ ఈ స్పై యూనివర్స్‌కు రూపకల్పన చేయగా.. ఈ థ్రిల్లింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు అజయ్ దేవగన్ సైతం ఆస‌క్తిగా ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్.

ప్రస్తుతానికి ఈ భారీ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించేది ఎవరనే విషయాన్ని మేకర్స్ అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. అజయ్ దేవగన్ అధికారిక సంతకం పూర్తవగానే వ‌చ్చే ఏడాది షూటింగ్ ప్రారంభించి 2028 లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని టీ-సిరీస్ ప్రణాళికలు రచిస్తోంది. అజయ్ దేవగన్ కెరీర్‌లోనే ఇదొక భారీ బ‌డ్జెట్ మూవీగా నిలవనుందని సమాచారం. అయితే ఈ యూనివ‌ర్శ్ కి ద‌ర్శ‌కుడు ఇంకా ఫిక్స్ కాలేదు. త్వ‌ర‌లోనే టీసిరీస్ రివీల్ చేయ‌నుంది. కమర్షియల్ - యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద నిలకడగా రాణిస్తున్న ఈ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో స్పై థ్రిల్లర్‌తో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో వేచి చూడాలి.

Ramayana vs Dhurandhar
O.M Review
O.M Review
23 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
23 Nov 2026
DNK Review
DNK Review
23 Nov 2026
GOAT Review
GOAT Review
23 Nov 2026
Scene Review
Scene Review
23 Nov 2026
Ramayana Review
Ramayana Review
23 Nov 2026