భోగి కి బంపర్ ఆఫర్
Bumper offer for Sharwanand Bhogi
ఈ నెల 12 న విడుదవ్వాల్సిన శర్వానంద్ - సంపత్ నంది ల భోగి చిత్రం సెన్సార్ ప్రోబ్లెంస్ తో వాయిదాపడింది. రీసెంట్ గా సెన్సార్ ఇష్యుస్ తొలిగిపోవడంతో హడావిడిగా భోగి చిత్రాన్ని ఈ నెల 27 న విడుదల అని రెండు రోజుల క్రితమే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు మేకర్స్. అయ్యో భోగి పోయి పోయి బెల్లంకొండ హైందవ, రష్మిక మైసా లపై పోటీకి వెళ్ళింది అనుకున్నారు.
బెల్లంకొండ శ్రీనివాస్ హైందవ విషయం ఎలా ఉన్నా ట్రేడ్ లో రష్మిక మైసా పై మంచి అంచనాలున్నాయి.. భోగి కి ఇబ్బంది తప్పదు అనుకుంటే.. ఇప్పుడు భోగి కి బంపర్ ఆఫర్ తగిలింది. భోగి కి డబుల్ అడ్వాంటేజ్ అన్నట్టుగా హైందవ తో పాటుగా మైసా కూడా పోస్ట్ పోన్ అయ్యింది. దానితో భోగి చిత్రానికి పెద్దగా పోటీ లేకుండా పోయింది.
బాక్సాఫీసు దగ్గర భోగి సోలోగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సో శర్వానంద్-సంపత్ నందీలు ఈ ఐదు రోజుల్లో భోగిని గట్టిగా ప్రమోట్ చేసి ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లి హైప్ పెంచితే మంచి ఓపెనింగ్స్ రావడం ఖాయం.
















































