గ్యాపిస్తే ఇస్తే మాయమే
Ormax Stars India: Prabhas occupies the No. 1 position
నిజంగా సెలబ్రిటీస్ ఎవరైనా ఎప్పుడు ఆడియన్స్ లో ఉండాలి, సినిమాలు లేకపోయినా అంటే రిలీజ్ చెయ్యకపోయినా ఫ్యాన్స్ కోసం ఏదో ఒక ఈవెంట్ లో సందడి చేస్తూనో లేదంటే పబ్లిక్ ఈవెంట్స్ కి రావడమో చేస్తేనే వారి క్రేజ్ బాగా కనిపిస్తుంది. అటు సినిమాలు విడుదల చెయ్యక, ఇటు పబ్లిక్ లోకి రాకపోతే వారిని ఆడియన్స్ ఇట్టే మరిచిపోతారు.
తాజాగా ఓర్మాక్స్ మీడియా అక్టోబర్ లో ఇండియా టాప్ 10 జాబితాను విడుదల చెయ్యగా అందులో ఎన్టీఆర్ మిస్ అవడం అభిమానులను కలిచివేసింది. ఓర్మాక్స్ మీడియా విడుదల చేసిన అక్టోబర్ నెల ఇండియా టాప్ 10 లో నెంబర్ 1 స్థానంలో ప్రభాస్ ఉంటె.. నెంబర్ 2 లో షారుఖ్ ఉన్నారు.
టాప్ 3 లో తమిళనాడు సీఎం ఉంటె.. 4th ప్లేస్ లో అల్లు అర్జున్ ఉన్నారు. సూపర్ స్టార్ మహేష్ 5 వ స్థానంలో ఉంటె.. యష్ 6 స్తానంలో, సూర్య 7th ప్లేస్ లో, సల్మాన్ ఖాన్ 8 వ స్థానంలో, అక్షయ్ కుమార్ 9 వ స్థానంలో, రామ్ చరణ్ 10 వ స్థానంలో ఉండగా ఎన్టీఆర్ టాప్ 10 లో లేకపోవడం అభిమానులకు షాకిచ్చింది.
ఎన్టీఆర్ దేవర రిలీజ్ తర్వాత వార్ 2 తో డిజప్పాయింట్ చేసారు. ఆతర్వాత డ్రాగన్ కోసం రెండున్నరేళ్లుగా కష్టపడుతున్నారు. ఆ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కి వస్తుంది. మరి పబ్లిక్ లో ఎక్కువ కనిపించకపోతే ఇలాంటి షాక్ లు తప్పవని ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు.
















































