ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Vijay Antony travels in unreserved train compartment

ప్రమోషన్ కోసం రైలెక్కిన హీరో

Vijay Antony travels in unreserved train compartmentVijay Antony travels in unreserved train compartment


కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని బిచ్చగాడు చిత్రం తో తెలుగు, తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఆ చిత్రం తర్వాత ఆయన వరస సినిమాలు చేస్తున్నా బిచ్చగాడు లాంటి మంచి హిట్ ని సొంతం చేసుకోలేకపోయారు. ఇక తమిళంలో తెరకెక్కించిన ఏ చిత్రాన్ని అయినా తెలుగులో ప్రమోట్ చేసి విడుదల చేసే విజయ్ ఆంటోని తన కొత్త సినిమా ప్రమోషన్స్ ని వినూత్నంగా మొదలు పెట్టారు.

రీసెంట్ గా విడుదలైన అప్ప కుట్టి సినిమా ప్రమోషన్స్ కోసం విజయ్ ఆంటోని రైలెక్కారు. చెన్నై నుంచి కోయంబత్తూరుకు కోవై ఎక్స్‌ప్రెస్‌లో విజయ్ ఆంటోని జనరల్ బోగీలో సాధారణ ప్రయాణికుడిలా ప్రయాణం చేయడం హాట్ టాపిక్ గా మారింది. ట్రైన్ లో ప్రయాణికులతో సరదాగా ముచ్చట్లు పెట్టిన ఈ హీరో అప్ప కుట్టి  సినిమా విశేషాలు పంచుకున్నారు.

థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులను కలవడానికి హీరో విజయ్ ఆంటోనీ ఇలా చెన్నై నుంచి కోయంబత్తూరు వెళ్లే రైలెక్కారు. అప్ప కుట్టి చిత్రాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు విజయ్ ఆంటోని ఈ రకమైన సరదా ప్రమోషన్స్ చేస్తున్నారు.

Vijay Antony travelled from Chennai to Coimbatore in the unreserved compartment
O.M Review
O.M Review
22 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
22 Nov 2026
DNK Review
DNK Review
22 Nov 2026
GOAT Review
GOAT Review
22 Nov 2026
Scene Review
Scene Review
22 Nov 2026
Ramayana Review
Ramayana Review
22 Nov 2026