ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Where is the sensibility in the Ramayana BGM?

రామాయ‌ణ బీజీఎం లో సెన్సిబిలిటీ ఎక్క‌డ‌?

Where is the sensibility in the Ramayana BGM?Where is the sensibility in the Ramayana BGM?

భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన `రామాయణ` సినిమాలో విజువల్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో? నేపథ్య సంగీతం విషయంలో మాత్రం అంతే స్థాయిలో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా భారతీయ ఆత్మ, భావోద్వేగాలు నిండిన సన్నివేశాల్లో ఏఆర్ రెహమాన్ మార్క్ డెప్త్.. సెన్సిబిలిటీ ఎక్కడో మిస్ అయినట్లు అనిపిస్తోంది. మన పురాణ గాథల్లో ఉండే సున్నితమైన ఎమోషన్స్‌ను ప్రేక్షకుల గుండెలకు హత్తుకునేలా చేయడంలో బీజీఎం ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాకు ఇద్దరు దిగ్గజ సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ కలిసి పనిచేయడం ప్రారంభంలో పెద్ద ఆకర్షణగా నిలిచింది. అయితే ఒకే సినిమాకు ఇద్దరు భిన్న ధృవాల లాంటి కంపోజర్లు పనిచేసినప్పుడు సహజంగానే క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. హన్స్ జిమ్మర్ శైలిలో భారీ హాలీవుడ్ యాక్షన్, హై-వోల్టేజ్ సౌండ్ డిజైన్ ఎక్కువగా కనిపిస్తే.. రెహమాన్ శైలిలో భారతీయ రాగాలు, లోతైన భావోద్వేగాలు ఉంటాయి. కానీ సినిమాలో ఈ రెండు శైలుల కలయికలో ఎక్కడో ఒకచోట సమన్వయం లోపించినట్లు అనిపిస్తోంది.

యుద్ధ సన్నివేశాలు, భారీ ఎలివేషన్ల వరకు హాలీవుడ్ స్థాయి సౌండ్ బాగానే వర్కౌట్ అయినా.. సీతారాముల మధ్య వచ్చే సున్నితమైన సన్నివేశాలు, త్యాగం, విరహం వంటి ఎమోషనల్ ఘట్టాల్లో మాత్రం ఆ హెవీ సౌండ్ డామినేట్ చేసినట్లు కనిపిస్తోంది. రెహమాన్ నుంచి ఆశించే ఆ మ్యాజికల్ టచ్, మనసును పిండేసే మెలోడీ ట్రాక్స్ గైర్హాజరు కావడం ప్రేక్షకులకు కొంత వెలితిగానే మిగిలింది.

మొత్తంగా చూస్తే ఇద్దరు మేధావులు ఒకే ప్రాజెక్ట్ కోసం పనిచేసినప్పుడు ఎవరి శైలిని వారు నిలబెట్టుకునే క్రమంలో కథలోని అసలైన భారతీయ సెన్సిబిలిటీ కాస్త పక్కకు వెళ్లిందా అనే సందేహాలు కలుగుతున్నాయి. విజువల్ వండర్‌గా నిలిచిన `రామాయణ`కు సంగీతం పరంగా కూడా రెహమాన్ మార్క్ ఎమోషనల్ డెప్త్ పూర్తిస్థాయిలో తోడై ఉంటే సినిమా స్థాయి మరోలా ఉండేదనేది  విశ్లేషకుల మాట.

Ramayana BGM
O.M Review
O.M Review
22 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
22 Nov 2026
DNK Review
DNK Review
22 Nov 2026
GOAT Review
GOAT Review
22 Nov 2026
Scene Review
Scene Review
22 Nov 2026
Ramayana Review
Ramayana Review
22 Nov 2026