ఉద్యోగం వదిలి పారిపోయిన హీరోయిన్ బాడీగార్డ్
Aishwarya Rai's former bodyguard reveals he was hired to protect her from Salman Khanఇది దశాబ్ధాల క్రితం ఒక పెను వివాదానికి సంబంధించినది. సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్ విడిపోయిన తర్వాత నెలకొన్న ఉద్రిక్త వాతావరణం గురించి మరో కీలక కోణం ఆసక్తిని రేకెత్తిస్తోంది. 1999లో `హమ్ దిల్ దే చుకే సనమ్` సెట్స్‌లో మొదలైన వీరి ప్రేమకథ 2000ల ప్రారంభంలో తీవ్ర వివాదాల మధ్య ముగిసింది. ఆ సమయంలో ఐశ్వర్యరాయ్ తన భద్రత కోసం నటుడు, బాడీబిల్డర్ కేతన్ కరణ్డేను బాడీగార్డ్‌గా నియమించుకున్నారు.
అయితే ఓ ఇంటర్వ్యూలో కేతన్ ఒక షాకిచ్చే విషయం చెప్పారు. సల్మాన్ నుంచి రక్షణ కోసమే తనను ఐశ్వర్య గార్డ్ గా పెట్టుకున్నారని.. తన నియామకం గురించి సల్మాన్‌కు కూడా తెలిసిందని తెలిపారు. తాను ఐశ్వర్య వద్ద పనిచేస్తున్న విషయాన్ని అప్పట్లో ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచానని కూడా వెల్లడించారు.
ఒక ఫ్యాషన్ షో సందర్భంగా సల్మాన్ ఖాన్‌తో ఎదురైన ఆందోళనకర పరిస్థితి.. ఆ తర్వాతి పరిణామాలే కేతన్ ఉద్యోగం నుంచి వైదొలగడానికి కారణమయ్యాయి. ఆ వేదిక వద్ద నెలకొన్న వాతావరణం మధ్య బాధ్యతలు నిర్వర్తించడం ఇబ్బందికరంగా మారడంతో.. ఆ ఘటన జరిగిన మరుసటి రోజే అతడు ఆ ఉద్యోగం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. కేవలం రెండు రోజుల్లోనే బాడీగార్డ్ బాధ్యతల నుంచి వైదొలగిన కారణం నిజంగా ఆశ్చర్యపరుస్తోంది.
















































