గ్రాండ్ గా అనిరుధ్ - కావ్య మారన్ రిసెప్షన్
Grand reception for Anirudh and Kavya Maran
కోలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్, సన్ రైజర్స్ అధినేత కావ్య మారన్ ల వివాహం ఈ నెల11 న గ్రీస్ వేదికగా జరిగిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ రజినీకాంత్, మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ లు అలాగే ఇరు కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల నడుమ అంగరంగ వైభవంగా అనిరుధ్ -కావ్య ల వివాహ వేడుక జరిగింది.
ఈరోజు శనివారం సాయంత్రం చెన్నై లో అనిరుధ్ - కావ్య మారన్ ల వెడ్డింగ్ రిసెప్షన్ ని కళానిధి మారన్ గ్రాండ్ గా ఆరెంజ్ చేసారు. ఈ రిసెప్షన్ కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు వరకు, తమిళనాడు సీఎం విజయ్ దగ్గర నుంచి మిగతా సెలబ్రిటీస్ వారికు ప్రత్యేకంగా భార్యతో కలిసి కళానిధి మారన్ ఆహ్వానాలు అందించారు.
అనిరుద్-కావ్య ల వెడ్డింగ్ రిసెప్షన్ కోసం సెలెబ్రిటీస్ ఇప్పటికే చెన్నై చేరుకోగా.. గ్రాండ్ రిసెప్షన్ మొదలైపోయింది. కావ్య మారన్ రెడ్ కలర్ డిజైనర్ గౌన్ లో మెరవగా.. అనిరుద్ రవిచంద్రన్ బ్లాక్ కలర్ కాస్ట్యూమ్ లో మెరిశారు. ఈ రిసెప్షన్ లో సన్ రైజర్స్ టీం, అలాగే సినీ, రాజకీయ రంగ ప్రముఖులు పాల్గొంటున్నారు.
















































