ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Salman Khan opens up about the future of his popular film franchises

ఫ్రాంచైజీ సినిమాలపై సల్మాన్ ఖాన్ ఓపెన్ అప్!

Salman Khan opens up about the future of his popular film franchisesSalman Khan opens up about the future of his popular film franchises

 

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్  ఫ్రాంచైజీ చిత్రాల సీక్వెల్స్‌పై తాజాగా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఒక సదస్సులో పాల్గొన్న ఆయన సూపర్ హిట్ చిత్రం `దబాంగ్` ఫ్రాంచైజీలో నాలుగో భాగం కచ్చితంగా వస్తుందని స్పష్టం చేశారు. `దబాంగ్` తమ చేతుల్లో ఉన్న ప్రాజెక్ట్ కావడంతో తప్పకుండా ముందుకు వెళ్తుందని.. మిగతా సీక్వెల్స్ మాత్రం సంబంధిత మేకర్స్ చేతుల్లో ఉన్నాయని సల్మాన్ వివరించారు.

మరోవైపు 2015లో వచ్చి ఘన విజయం సాధించిన `భజరంగీ భాయిజాన్` సీక్వెల్ మాత్రం సాధ్యం కాదని సల్మాన్ ఖాన్ తేల్చి చెప్పారు. ఆ కథకు కొనసాగింపుగా మరో సినిమా తీయడం భావోద్వేగపరంగా అంత సులభం కాదని, మొదటి సినిమాతో పోల్చి రెండో భాగంలో ఆ మజా లేదనే మాట రాకూడదనే ఉద్దేశంతోనే ఆ ఆలోచన చేయడం లేదని  స్పష్టం చేశారు. అలాగే కొత్త చిత్రం `మాతృభూమి` గురించి మాట్లాడుతూ.. సినిమా థియేటర్లలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని.. సరిహద్దు ఘటన నేపథ్యం .. కుటుంబాలపై దాని ప్రభావం ఆధారంగా ఇది కూడా `భజరంగీ భాయిజాన్` తరహా చిత్రమేనని పేర్కొన్నారు.

కబీర్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన `భజరంగీ భాయిజాన్` ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోగా 2010లో మొదలైన `దబాంగ్` ఇప్పటికే రెండు సీక్వెల్స్‌తో సందడి చేసింది. ఇద్దరికీ నచ్చే సరైన స్క్రిప్ట్ కుదిరితే `దబాంగ్ 4` పట్టాలెక్కుతుందని సల్మాన్ సంకేతాలివ్వడంతో చుల్‌బుల్ పాండేను మళ్లీ చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Salman Khan About Bajrangi Bhaijaan And Kick Sequels
O.M Review
O.M Review
21 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
21 Nov 2026
DNK Review
DNK Review
21 Nov 2026
GOAT Review
GOAT Review
21 Nov 2026
Scene Review
Scene Review
21 Nov 2026
Ramayana Review
Ramayana Review
21 Nov 2026