ప్రమోషన్స్ లేట్ కానీ రిలీజ్ పక్కా
King 100 post production in full swing
డిసెంబర్ 24 న విడుదల కాబోయే నందమూరి బాలకృష్ణ దాదా చిత్రం ప్రమోషన్స్ మొదలైపోయాయి. ఫస్ట్ సింగిల్ వదిలారు. అది ప్రస్తుతం ఓ ఊపు ఊపుతుంది. అదే రోజు విడుదల కాబోతున్న హిందీ షారుఖ్ కింగ్ కూడా ఫస్ట్ సింగిల్ తో సోషల్ మీడియాలో చాలా హడావిడి చేసారు.
కానీ అదే 24 న విడుదలకు సిద్ధమవుతున్న #King 100 చిత్రం మాత్రం ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యలేదు. సినిమా మొదలైనప్పటినుంచి చాలా రేర్ అప్ డేట్స్ తో ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా షూటింగ్ చేసుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యలేదు అనేది అక్కినేని అభిమానుల కంప్లైంట్.
దానితో #King 100 చిత్రం పోస్ట్ పోన్ అవుతుందేమోలే అందుకే ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యలేదు అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే డిసెంబర్ 24 రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదు.. కింగ్ 100 పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నాగార్జున షూటింగ్ ఫినిష్ చేసే పనిలో ఉన్నారు.
ప్రమోషన్స్ లేట్ అవ్వోచ్చేమో కానీ.. KIng 100 రిలీజ్ విషయంలో మార్పు లేదు అనుకున్న సమయానికే కింగ్ 100 విడుదల అంటూ చెప్పడం అక్కినేని ఫ్యాన్స్ కి ఊరటనిస్తోంది.
















































