నటుడు బండ్ల గణేష్ కు ఏడాది జైలు

Bandla Ganesh gets one-year jailBandla Ganesh gets one-year jail

 

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కి కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఆయనకు ఏడాది జైలు శిక్ష విధించడమే కాదు రూ.95 లక్షల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం సంచలనం సృష్టించింది. చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.95 లక్షల జరిమానా విధించింది కోర్టు.

గతంలో బండ్ల గణేష్ జానకి రామయ్య అనే వ్యక్తి దగ్గర రూ.95 లక్షల అప్పు తీసుకున్నారు. ఆతర్వాత జానకి రామయ్య మరణించడంతో.. బండ్ల గణేష్ జానకి రామయ్య తండ్రికి పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పేరుపై చెక్ ఇవ్వగా అది బౌన్స్ అవవడంతో ఆయన కోర్టుని ఆశ్రయించారు.

సుదీర్ఘ విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో బండ్ల గణేష్ కు కోర్టు ఈ శిక్ష విధించింది. జరిమానా మొత్తంతో పాటు బాధితుడి కోర్టు ఖర్చులను కూడా చెల్లించాలని ఆదేశించింది. 

One year Imprisonment for Bandla Ganesh