ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Sonakshi Sinha reacts to Rahul Gandhi's comment about Sonia Gandhi sitting

రాహుల్ గాంధీ మాటలను గుర్తుచేస్తూ సోనాక్షి చమత్కారం!

Sonakshi Sinha reacts to Rahul Gandhi's comment about Sonia Gandhi sittingSonakshi Sinha reacts to Rahul Gandhi's comment about Sonia Gandhi sitting

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల  తల్లిదండ్రులు సోనియా గాంధీ, రాజీవ్ గాంధీలకు సంబంధించిన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్న విషయం తెలిసిందే. సోనియా గాంధీ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన..  తల్లిదండ్రులు ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తపరిచే విధానం గురించి చెబుతూ భోజనం చేసే సమయంలో సోనియా గాంధీ తరచూ రాజీవ్ గాంధీ ఒడిలో కూర్చునేవారని గుర్తుచేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారగా దీనిపై బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ఫన్నీగా స్పందించారు.

సోనియా, రాజీవ్ గాంధీల అన్యోన్యతపై నెట్టింట జరుగుతున్న చర్చను ఉద్దేశించి సోనాక్షి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. `భవిష్యత్తులో పుట్టబోయే నా పిల్లల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. వాళ్లకు అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. ఇప్పటి నుంచే పిల్లలారా.. సిద్ధంగా ఉండండి` అంటూ చమత్కరించారు. తన భర్త జహీర్ ఇక్బాల్‌తో కలిసి సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతున్న సోనాక్షి, రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తనదైన శైలిలో సరదాగా కనెక్ట్ చేస్తూ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇక రాహుల్ గాంధీ  తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ.. చిన్నతనంలో ఇతరుల ఇళ్లకు వెళ్లినప్పుడు వారి తల్లిదండ్రులు అలా కూర్చోకపోవడాన్ని చూసి  ఆశ్చర్యపోయేవాడినని సరదాగా పంచుకున్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై కొందరు విమర్శలు గుప్పించగా.. రాహుల్ గాంధీ మాత్రం వాటిని తిప్పికొట్టారు. కర్ణాటకలోని ప్రసిద్ధ హోయసళేశ్వర ఆలయంలోని 12వ శతాబ్దపు శిల్పాన్ని  షేర్ చేస్తూ.. ప్రేమను అర్థం చేసుకోవడానికి, వ్యక్తపరచడానికి ఎవరికీ ఎలాంటి సంకోచాలు ఉండకూడదంటూ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

 

Sonakshi Sinha has reacted playfully to the controversy surrounding Rahul Gandhi's remarks about his parents