BB10: నన్నే టార్గెట్ చేసారు ఆంటూ వర్షిణి ఏడుపు
Varshini Emotional Moment in Bigg Boss Telugu 10
బిగ్ బాస్ సీజన్ 10 రెండో వారం నుంచి ప్రేక్షకులు చిరాగ్గా భరిస్తున్నా వర్షిణి ఎలిమినేషన్ కోసం ఎంతో వెయిట్ చేస్తున్నా యాజమాన్యం బలవంతంగా వర్షిణి బి ఆడియన్స్ మీద రుద్దుతున్నారు. టాస్క్ ఆడదు, మాట్లాడితే వుమెన్ కార్డు తీస్తుంది. ముఖేష్ ప్రేమలో మునిగి తేలుతుంది. త్రిగుణ ఫ్రెండ్ షిప్ వదులుకుంది.
అదే పదో వారం లో ఎక్స్ హౌస్ మేట్స్ వచ్చి వర్షిణి టార్గెట్ చేస్తూ నామినేషన్స్ చేసారు. ముందుగా అపూర్వ వర్షిణి గురించి బ్రూతల్ గా ఎక్స్ పోజ్ చేసింది. ఆమె పది వారాలుగా తేరగా తింటూ పని చెయ్యకుండా, ఆట ఆడకుండా, బ్యాక్ బిచ్చింగ్ చేస్తుంది, త్రిగుణ నువ్వు జాగ్రత్త అంటూ నామినేట్ చేసింది.
ఆతర్వాత సృష్టి వచ్చి వర్షిణి ని టార్గెట్ చేస్తూ అమన్ కెప్టెన్సీ లాక్కున్నావు, కానీ అమన్ కెప్టెన్సీ కంటెండర్ అయినప్పుడు అమన్ ని నువ్వు ఎందుకు సపోర్ట్ చెయ్యలేదు అంటూ నామినేట్ చేసింది. ఈ ప్రాసెస్ లో అపూర్వ కి వర్షిణికి, సృష్టి కి వర్షిణి కి మధ్యన పెద్ద అర్గ్యూ జరిగింది.
హమ్మయ్య వర్షిణి బాగా టార్గెట్ అయ్యింది, ఈ వారమైనా వెళ్లిపోవాలని బయట ఆడియన్స్ అనుకుంటుంటే.. వర్షిణి ఒక్కర్తే కూర్చుని నేను ఎవరిని బూతులు తిట్టలేదు, ఒక్క మాట B, P అన్నాను అని, త్రిగుణ పర్సనల్ తెలుసు అన్నా కానీ అదేమిటో చెప్పలేదు, నన్ను కావాలని టార్గెట్ చేసి నామినేట్ చేసారంటూ కెమెరా ముందు కూర్చుని ఏడుస్తుంది. పాపం వర్షిణి.
















































