ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Robert Pattinson Is Officially James Bond

దశాబ్దాల సంప్రదాయానికి తెర.. కొత్త బాండ్ ఇత‌డే!

Robert Pattinson Is Officially James BondRobert Pattinson Is Officially James Bond

 

హాలీవుడ్ లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న‌`జేమ్స్ బాండ్`  సిరీస్‌లో దశాబ్దాలుగా వస్తున్న  ప్రత్యేకమైన సంప్రదాయానికి తెరపడింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను కలిగి ఉన్న సీక్రెట్ ఏజెంట్ 007 పాత్ర కోసం మేకర్స్ ఈసారి ఏకంగా గ్లోబల్ ఏ-లిస్ట్ స్టార్  రాబర్ట్ ప్యాటిన్సన్ ను ఎంపిక చేశారు. అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ బాండ్ ఫ్రాంచైజీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్న సంచలన నిర్ణయం హాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమ‌వుతోంది.

జేమ్స్ బాండ్ చిత్రాల చరిత్రను పరిశీలిస్తే ఈ పాత్ర కోసం మేకర్స్ ఎప్పుడూ పెద్దగా తెలియని నటులను .. థియేటర్ ఆర్టిస్టులను మాత్రమే ఎంపిక చేసేవారు. మొదటి బాండ్ సీన్ కానరీ నుంచి జార్జ్ లాజెన్బీ , తిమోతి డాల్టన్, పియర్స్ బ్రాస్నన్ ..చివరిగా డానియెల్ క్రెయిగ్ వరకు అందరూ బాండ్ పాత్రతోనే  గ్లోబల్ స్టార్స్‌గా ఎదిగారన్న‌ది కాద‌న‌లేని నిజం. కానీ కొత్త ప్రాజెక్ట్ కోసం 40 ఏళ్ల వయసున్న రాబర్ట్ ప్యాటిన్సన్‌ను బాండ్‌గా ఎంపిక చేయడంతో పాత రూల్స్‌ను పూర్తిగా బ్రేక్  చేసిన‌ట్లు అయింది. ఇప్పటికే ప్యాటిన్స‌న్  `ట్విలైట్`, `ది బ్యాట్‌మ్యాన్` వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే.  తాజాగా 007 ఏజెంట్‌గా బాధ్యతలు చేప‌ట్ట‌డం ప్యాటిన్స‌న్ కెరీర్‌లో మరో అరుదైన మైలురాయి.

గతంలో రిచర్డ్ బర్టన్, క్లింట్ ఈస్ట్‌వుడ్ వంటి దిగ్గజ నటులకు బాండ్ ఆఫర్లు వ‌చ్చినా? వారు సున్ని తంగా తిరస్క రించారు. కానీ ప్యాటిన్సన్ ఆఫర్‌ను అంగీకరించడంతో అమెజాన్ సంస్థ  ఫ్రాంచైజీని భారీ స్థాయిలో.. గ్లోబల్ మార్కెట్ను దృష్టిలో ఉంచుకుని కమర్షియల్ దిశగా తీర్చిదిద్దే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది. అయితే బాండ్  మార్పు వెనుక స్టూడియో వ్యూహం కనిపిస్తోంది. మేనేజ్‌మెంట్ చేతులు మారిన‌ నేప‌థ్యంలో బాండ్ సిరీస్‌ను  స్పై యాక్షన్ ఫిల్మ్‌ను ప‌క్కాగా క‌మ‌ర్శిలైజ్ చేసి మార్కెట్ లోకి వ‌దిలేలా ప్లాన్ చేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది.

స్టార్ ఇమేజ్ ఉన్న నటుడిని బరిలోకి దింపడం ద్వారా భారీ ఎత్తున  ఓపెనింగ్స్ కు అవ‌కాశం ఉంటుంది. హిట్ టాక్ తెచ్చుకుంటే?  భార‌త్ స‌హా వ‌ర‌ల్డ్ వైడ్ రికార్డుల మోత మోగుతుంది. ఈ ప్లాన్ తో నే బాండ్ పాత్ర‌కు ఫేమ‌స్ న‌టుడిని రంగంలోకి దించుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని డెనిస్ విల్లెనెవ్  డైరెక్ట్ చేయ‌నున్నారు. షూటింగ్ స‌హా అన్ని ప‌నులు పూర్తి చేసుకుని 2028లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Robert Pattinson says being cast as new James Bond is honour of a lifetime