ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Dragon Part 2 misses its December 2027 release?

డ్రాగన్ పార్ట్ 1 జూన్, పార్ట్ 2 డిసెంబర్?

Dragon Part 2 misses its December 2027 release?Dragon Part 2 misses its December 2027 release?


కన్నడ పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున డ్రాగన్ షూటింగ్ ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే డ్రాగన్ పార్ట్ 1 ని 2027 జూన్ అంటూ ఎప్పుడో డేట్ లాక్ చేసారు మేకర్స్.

అయితే తారక్ కి ఈమధ్యన భుజానికి జరిగిన సర్జరీ తర్వాత రెండు నెలలు బ్రేక్ తీసుకోవడంతో డ్రాగన్ వచ్చే ఏడాది జూన్ లో విడుదలవుతుందా అనే సందేహాల నడుమ తాజాగా డ్రాగన్ పార్ట్ 1 జూన్ లో ఉంటె.. డ్రాగన్ పార్ట్ 2 వచ్చే ఏడాది డిసెంబర్లో రిలీజ్ ఉండొచ్చు, లేదంటే 2028 సమ్మర్ కి పార్ట్ 2 వెళ్లొచ్చని సమాచారం.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ తో రుక్మిణి వసంత్ నటిస్తుంది. అయితే బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్, అలియా భట్ ల డ్రాగన్ చిత్రంలో భాగం కాబోతున్నారని.. పార్ట్ 1, పార్ట్ 2 రెండు చిత్రాలు షూటింగ్ ఒకేసారి పూర్తి చేసి ఆరు నెలల గ్యాప్ లో విడుదల చెయ్యాలని ప్రశాంత్ నీల్ ఆలోచనగా తెలుస్తుంది. 

Dragon Part 2 – December 2027?