ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss Telugu 10-Apoorva exposed Varshini

BB10: వర్షిణి ని ఎక్స్పోజ్ చేసిన అపూర్వ

Bigg Boss Telugu 10-Apoorva exposed VarshiniBigg Boss Telugu 10-Apoorva exposed Varshini



బిగ్ బాస్ హౌస్ లో ఎక్స్ హౌస్ మేట్స్ సోమవారం నామినేషన్స్ ప్రక్రియలోకి ఎంటర్ అయ్యి ప్రకంపనలు సృష్టించారు. షాలిని ముందుగా వచ్చి నీతూ ని నామినేట్ చేస్తూ రోహిత్ తో తనకున్న బాండింగ్ పై నీతూ మాట్లాడిన మాటలకు ఇచ్చి పడేసింది. నీతూ డిపెండ్ చేసుకోవడానికి లేకుండా చేసింది. త్రిగుణ్‌ కి డాగర్ ఇచ్చి షాకిచ్చింది.

తర్వాత మిథిలేష్ వచ్చి ముఖేష్ ని టార్గెట్ చేస్తూ రోహిత్ ని ఫ్రెండ్ అన్నావ్, సుధీర్ విషయంలో నమ్మక ద్రోహం చేసావ్ అంటూ ముఖేష్ ని నామినేట్ చేసాడు. ఇక అపూర్వ హౌస్ లోకి వచ్చింది.. రాగానే వర్షిణి ని టార్గెట్ చేస్తూ అమ్మా వర్షిణి బిగ్ బాస్ పర్సనాలిటీ షో అన్నావ్ అంటూ త్రిగుణ్‌ ని వర్షిణి బ్యాక్ స్టాపింగ్ చేస్తూ అన్న మాటలన్నీ కక్కేసింది.

ప్రతి ఫ్యామిలీ వచ్చి త్రిగుణ్‌ ని గేమ్ చేంజర్ అనో, అదనో, ఇదనో అని చెప్తుంటే మీకు ఒక జెలసీ, ఒక కడుపుమంట.. నాకు అక్కడకు తగిలింది అంటూ అపూర్వ వర్షిణి తో అనేసరికి వర్షిణి, ముఖేష్ ల ఫేస్ లు మాడిపోయాయి. నిజంగానే అందరి ఫ్యామిలీస్ త్రిగుణ్‌ కి స్టార్స్ ఇచ్చేసరికి వర్షిణి షాకయ్యి అమన్, దేబ్జానీ తో మీటింగ్ పెట్టి త్రిగుణ్‌ కి ఎలా అంటూ మాట్లాడింది.

ఇక ముఖేష్ ఫ్యామిలీ వీక్ లో అందరూ త్రిగుణ్‌ ని పొగుడుతుంటే ఉడికిపోయాడు. అదే అపూర్వ చెప్పింది. నువ్వు ముఖేష్ వల్లనే హౌస్ లో కనిపిస్తున్నావు, అసలు పని చెయ్యవ్, తింటావ్, టాస్క్ ఆడవు అంటూ అపూర్వ వర్షిణి ఎడా పెడా దులిపేసింది. మరి నువ్వు ఆడావు ఏమి పీకావు అని వర్షిణి అంటే.. నీ కేరెక్టర్ నే పీకేశా అంటూ త్రిగుణ్‌ ఈ ఫ్రెండ్ ని నమ్మకు అంటూ ఓ లెవల్లో వర్షిణి ని ఎక్స్పోజ్ చేసింది అపూర్వ.
 

Bigg Boss Telugu 10-Apoorva vs Varshini