ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss 10: A big shock for Rohit's fans

బిగ్ బాస్ 10: రోహిత్ ఫ్యాన్స్ కి బిగ్ షాక్

Bigg Boss 10: A big shock for Rohit's fansBigg Boss 10: A big shock for Rohit's fans

 

బిగ్ బాస్ నుంచి మూడు వారాల క్రితం ఎలిమినేట్ అయిన రోహిత్ నాయుడు ఎప్పుడెప్పడు హౌస్ లోకి రీ ఎంట్రీ ఇస్తాడా అని ఆయన అభిమానులు ఎదురు చూడని రోజు లేదు, బిగ్ బాస్ రివ్యూయర్స్ కూడా రోహిత్ రీ ఎంట్రీ కన్ ఫర్మ్ అంటూ ఇచ్చిన న్యూస్ చూసి ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు. రోహిత్ ఫ్యాన్స్ రోహిత్ ఎలిమినేషన్ అన్యాయం, ఆయన్ని మళ్ళీ రీ ఎంట్రీ ఇప్పించాలని చాలా డిమాండ్లు చేశారు.

ఇక ఈవారం రోహిత్ రీ ఎంట్రీ కాదు కాదు నామినేషన్స్ కోసం ఓల్డ్ హౌస్ మేట్స్ హౌస్ లోకి రావాల్సి ఉంది, అందులో రోహిత్ ఉన్నాడనే వార్తలకు రోహిత్ నాయుడు చెక్ పెట్టాడు. తాను హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వడం లేదు, అలాగే నామినేషన్స్ కోసం అసలు రావడం లేదు, తన ఆట ముగిసింది అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రెస్ నోట్ వదిలాడు.

దానితో రోహిత్ అభిమానులు ఖంగు తిన్నారు. రోహిత్ రీ ఎంట్రీ ఇస్తే హౌస్ లో అతని ఆట మళ్ళీ చూడాలని వారు చాలా ఆశపడ్డారు. ఇక ఈరోజు సోమవారం ఎపిసోడ్ లో షాలిని, అపూర్వ, మిథిలేష్, ఝాన్సీ, దక్షి లు హౌస్ లోకి వచ్చి తమకు నచ్చని వాళ్ళను నామినేషన్స్ చేసారు. షాలిని నీతుని, అపూర్వ వర్షిణి ని..

ఝాన్సీ దేబ్జనిని, దక్షి నీతూ ని, మిథిలేష్ ముఖేష్ ని నామినేట్ చెయ్యడమే కాదు తమకు నచ్చిన వాళ్లకు డాగర్ ఇచ్చి వేరే వాళ్లను నామినేషన్ లోకి పంపించారు.

Bigg Boss Telugu 10 Big shock for Rohit's fans