శ్రీలీల కెరీర్ ని డిసైడ్ చేసే సినిమా!
A Very Crucial Film for Sreeleela
కోలీవుడ్ లో క్యూట్ బ్యూటీ శ్రీలీల కి ఇప్పటి వరకు హిట్ లేదు. శ్రీలీల చేసిన సినిమాలు అక్కడ ఫెయిల్ అయ్యాయి. అయినప్పటికి శ్రీలీల క్రేజీగా తమిళనాట ఛాన్స్ లు అందుకుంటుంది. ప్రస్తుతం శ్రీలీల రజినీకాంత్ ధర్మన్ అలాగే అజిత్ కుమార్ డేర్ డెవిల్ చిత్రాల్లో నటిస్తుంది. అంతేకాదు ధనుష్ ఓం తో రేపు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ధనుష్ కి భార్యగా ఓం చిత్రంలో శ్రీలీల చాలా సాదా సీదా మిడిల్ క్లాస్ వైఫ్ గా కనిపించబోతుంది. మంచి హైప్ తో రేపు శుక్రవారం విడుదల కాబోతున్న ఓం చిత్రంలో సాయి పల్లవి మరో హీరోయిన్ గా పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో కనిపించబోతుంది. మమ్ముట్టి విలన్ గా కనిపించనున్నారు.
ఈచిత్రంతో శ్రీలీల హిట్ కొడితేనే ఆమెకు తమిళనాట ఎంతోకొంత ఛాన్స్ లు వస్తాయి. లేదంటే మిగిలిన రెండు చిత్రాల తర్వాత ఆమెకు కోలీవుడ్ లో కూడా ఛాన్స్ లు రాకపోవచ్చు. మరి ఓం హిట్ అవ్వాలని శ్రీలీల ఫ్యాన్స్ అయితే చాలా బలంగా కోరుకుంటున్నారు.
















































