వారణాసి: ఆల్ హ్యాపీస్

Varanasi Shooting Update Varanasi Shooting Update

 

సూపర్ స్టార్ మహేష్ హీరోగా ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి చిత్రం షూటింగ్ విశేషాలు, వారణాసి చిత్రానికి సంబందించిన ఏ విషయమైనా ఇట్టే వైరల్ అవుతున్నాయి. రాజమౌళి ఏది దాచుకోకుండా వారణాసి కబుర్లు మొత్తం చెప్పేస్తున్నారు. అయితే  ఈమధ్యన వారణాసి సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7 నుంచి పోస్ట్ పోన్ అయ్యి ఆగష్టు కి వెళ్లబోతుంది అనే న్యూస్ నడుస్తుంది.

అలాంటి సమయంలో వారణాసి చిత్ర బృందం ఆ వార్తలను కొట్టిపారెయ్యకుండా.. కూల్ గా వారణాసి షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం వారణాసి కి సంబంధించి గ్రాఫిక్స్, అలాగే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పనులు జరుగుతున్నాయి, త్వరలో డబ్బింగ్ ప్రారంభం కానున్నాయంటూ చిత్రం బృందం ఇచ్చిన అప్ డేట్ మహేష్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపింది.

ఎందుకంటే షూటింగ్ పూర్తి కాలేదు, మరోపక్క సినిమా పోస్ట్ పోన్ అంటూ వస్తున్న వార్తలతో మహేష్ ఫ్యాన్స్ కాస్త డిజప్పాయయింట్ మోడ్ లో ఉన్నారు. కానీ ఇప్పుడు షూటింగ్ పూర్తయ్యింది, CG, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పనులు చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయనే మాట వాళ్ళకి హ్యాపినెస్ ఇచ్చింది. 

Varanasi MovieUpdate