ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss Telugu 10 : All families placed Thrigun in top 3

త్రిగుణ్ ఆట అర్ధం కాక కోట్టేసుకుంటున్న హౌస్ మేట్స్

Bigg Boss Telugu 10 : All families placed Thrigun in top 3Bigg Boss Telugu 10 : All families placed Thrigun in top 3


బిగ్ బాస్ సీజన్ 10 లో ఒకే ఒక్కడు ఇప్పుడు హౌస్ మేట్స్ ఆలోచనలోను, బయట ఆడియన్స్ ఆలోచనల్లోనూ హైలెట్ అవుతున్నాడు. అతనే త్రిగుణ్. బిగ్ బాస్ హౌస్ లో మానిప్యులేటర్ గా, గేమ్ చెంజర్ గా మిగతా హౌస్ మేట్స్ కి కొరకరాని కొయ్యగా తయారైన త్రిగుణ్ ఆట అర్ధ కాక ఇప్పుడు హౌస్ మేట్స్ కొట్టేసుకుంటున్నారు.

గత వారం ఫ్యామిలీ వీక్ లో హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరొచ్చినా త్రిగుణ్ ఆట ని పొగిడేశారు. ఇక వీకెండ్ ఎపిసోడ్ లో ఆదివారం వచ్చిన హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబెర్స్, అలాగే గెస్ట్ లు అందరూ త్రిగుణ్ ని టాప్ 3 లో పెట్టారు. 13మంది ఫ్యామిలీస్ త్రిగుణ్ ఆటను పొగిడేశారు.

హైపర్ ఆది అయితే త్రిగుణ్ కి ఇచ్చిన ఎలివేషన్ వేరే లెవల్. అన్ని ఫ్యామిలీస్ త్రిగుణ్ ని టాప్ 3 లో పెట్టేసరికి మిగతా హౌస్ మేట్స్ ముఖాలు మాడిపోయాయి. ముఖ్యంగా వర్షిణి, ముఖేష్ గురించి చెప్పక్కర్లేదు. వర్షిణి.. అమన్, దేబ్జానీ తో మాట్లాడుతూ త్రిగుణ్ కి ఏంటి అందరు ఫ్యామిలీస్ స్టార్స్ ఇచ్చారు,

మనకు కనిపించనిది త్రిగుణ్ లో వారికి ఏదో కనిపించింది. కనీసం వైల్డ్ ఫైర్స్ కి అయినా అర్ధం కావాలి త్రిగుణ్ గురించి, వాళ్ళు త్రిగుణ్ ఆట చూసి వచ్చారు అంటే అవును అంటూ అమన్ షాకయ్యాడు. ఇక దేబ్జానీ అయితే త్రిగుణ్ మొదట్లో నెగెటివ్ గా ఉన్నాడు, తర్వాత ఆటలో, మాటలో హైలెట్ అవుతూ గేమ్ ఛేంజ్ చేస్తున్నాడంటూ మాట్లాడింది.

సుధీర్ ఇన్ని సీజన్స్ లో త్రిగుణ్ లాంటి వ్యక్తిని చూడలేదు, త్రిగుణ్ సూపర్ అంటూ నీతూ మాస్టర్ తో మాట్లాడాడు. అమన్ అక్కా అంటూ నీతూ తో త్రిగుణ్ గురించిన వీడియోస్ వైరల్ అవుతున్నాయి. త్రిగుణ్ ని టాప్ 3 కంటెస్టెంట్ గా అందరూ ఇష్టపడడం మాత్రం హౌస్ మేట్స్ ని తీవ్రంగా కలవరపరిచింది. 

Thrigun: first contestant in BB history to be placed in top 3 by all families