బిగ్ బాస్ 10: ఈ వారం ఇద్దరు అవుట్
Bigg Boss Telugu 10 : Swetha Eliminated
బిగ్ బాస్ సీజన్ 10 లో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ పూర్తయ్యింది. కానీ వర్షిణి తల్లి, రామకృష్ణ తల్లి శనివారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు. అలాగే హౌస్ మేట్స్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చారు. హౌస్ మేట్స్ లో ఫ్రెండ్స్ అంతా జోష్ ని నింపడమే కాదు... హౌస్ లో వారు ఏ పొజిషన్ లో ఉన్నారో కూడా వారికి అర్ధంయ్యేట్టు చేసారు.
అయితే గత వారం దివాళి స్పెషల్ గా ఎలిమినేషన్ ని ఎత్తెయ్యగా.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే బోటం లైన్ లో ఉన్న నీతూ, వర్షిణి కాకుండా ఈ వారం సర్ ప్రైజింగ్ గా ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయినట్లుగా లీకులు బయటకొచ్చేశాయి.
ముందుగా వైల్డ్ ఫైర్ అంటూ ఎంటర్ అయ్యి కంటెంట్ ఇవ్వలేని శ్వేతా నాయుడు ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తుంది. డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా మరో వైల్డ్ ఫైర్ రామకృష్ణ ను కూడా పంపించేసినట్లుగా తెలుస్తుంది. మరి శ్వేతా నాయుడు ఎలిమినేషన్ అయితే పక్కా.. కానీ రామకృష్ణ ఎలిమినేషన్ విషయం క్లారిటీ రావాల్సి ఉంది.














































