గిరిబాబు మృతి పట్ల.. బాలయ్య, చిరు సంతాపం

Balakrishna about GiribabuBalakrishna about Giribabu


నందమూరి బాలకృష్ణ

సీనియర్‌ నటులు, దర్శక నిర్మాత గిరిబాబు మరణవార్త దిగ్బ్రాంతికి గురి చేసింది. నా కెరీర్‌ ప్రారంభంలోనే 'అన్నదమ్ముల అనుబంధం'లో ఆయనతో కలిసి నటించాను. నా పలు చిత్రాలలో ఆయన ప్రాధాన్యమున్న పాత్రలు పోషించారు. గిరిబాబు మంచి నటుడు మాత్రమే కాదు... మంచి వ్యక్తి కూడా. ఆయన లేని లోటు తీర్చలేనిది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. గిరిబాబు తనయుడు రఘుబాబుకు,  కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను.

చిరంజీవి

ప్రముఖ నటుడు గిరిబాబు గారి మృతిపట్ల సంతాపం తెలిపిన మెగాస్టార్ చిరంజీవి

ప్రముఖ తెలుగు సినీ నటుడు గిరిబాబు మృతిపట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌ను షేర్ చేశారు.

''ప్రముఖ నటులు గిరిబాబు గారు ఇకలేరనే వార్త నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది.

విలక్షణమైన నటనతో, తనదైన ప్రత్యేక శైలితో ఎన్నో వైవిధ్యమైన చిత్రాల ద్వారా నటుడుగా, నిర్మాతగా, దర్శకునిగా తెలుగు చిత్ర పరిశ్రమకు గిరిబాబు గారు అందించిన సేవలు చిరస్మరణీయం.

ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ... వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓం శాంతి 🙏

మంచు మోహన్ బాబు

బాధతో నాకు మాటలు రావడం లేదు, అతని ఆత్మకు శాంతి కలగాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను.

ఈ క్రమంలో మంచు మోహన్ బాబు గారు మాట్లాడుతూ..  ‘మద్రాస్‌లో ఉన్నప్పుడు గిరిబాబు, నేను రూమ్ మేట్స్. మేం అత్యంత సన్నిహితులం. ఇండస్ట్రీలో నాకంటే ముందు అతను నటుడయ్యారు. అలా మేం ఇద మరొకరం నటిస్తూ వచ్చాం. గిరిబాబు గొప్ప మనసున్న వ్యక్తి. ఎన్నో విలక్షణమైన పాత్రలను పోషించారు. దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా ఎన్నో విజయాలను సాధించారు. అలాంటి వ్యక్తి సినిమా పరిశ్రమలో లేరని తెలియడం బాధగా ఉంది. బాధతో నాకు మాటలు రావడం లేదు. గిరిబాబు ఆత్మకు శాంతి, అతని కుటుంబానికి మనశ్శాంతి కలగాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను’ అని అన్నారు.

Chirnjeevi about Giri Babu