సెట్లో లారా దత్తాకు ఊహించని షాక్!
Lara Dutta recalls a terrifying moment on Ramayana sets`రామాయణం` సెట్స్ నుంచి నిత్యం ఏదో ఓ ఆసక్తికర విషయం వార్తల్లో నిలుస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో నటి లారా దత్తా కైకేయి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ పాత్ర కోసం లారా ధరించిన కాస్ట్యూమ్స్ .. భారీ ఆభరణాలు సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. తాజాగా షూటింగ్ సెట్లో లారా దత్తాకు సంబంధించిన ఓ ఆసక్తికర సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సినిమా కోసం వేసుకున్న ఆభరణాలలో భాగంగా లారా దత్తా ధరించిన భారీ బ్రాస్‌లెట్ ఆమె చేతికి బిగుసుకు పోయింది. ఎంత ప్రయత్నించినా బయటకు రాకపోవడంతో మేకప్ ..కాస్ట్యూమ్స్ బృందం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. సాధారణ పద్ధతుల్లో తొలగకపోవడంతో చివరకు సెట్‌లోని సిబ్బంది చిన్న రంపపు బ్లేడ్‌ను ఉపయోగించి ఆ బ్రాస్‌లెట్‌ను కట్ చేయాల్సి వచ్చింది.
ఈ ఫన్నీ అనుభవాన్ని లారా దత్తా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. `ఇలాంటి అద్భుతమైన రూపం వెనుక తెరవెనుక ఎంతో శ్రమ ఉంటుంది. చివరికి మీ చేతి మణికట్టును రంపంతో కోసేంత ప్రమాదం జరిగే వరకు ఇది సాగుతుంది` అంటూ వీడియోకు సరదాగా క్యాప్షన్ జోడించారు. పౌరాణిక పాత్రల కోసం నటీనటులు ఎంతటి కష్టపడతారో? ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటారో చెప్పడానికి ఈ సంఘటన నిదర్శనంగా నిలిచింది.














































