అన్‌ఎక్స్‌పెక్టెడ్ కాంబో సెట్
Anil Ravipudi to direct NTR
అసలు ఎవరూ ఊహించని కాంబో, ఇప్పట్లో కుదురుంది అని ఆలోచనలో కూడా లేని కాంబో సెట్ అయ్యింది. అన్‌ఎక్స్‌పెక్టెడ్ కాంబో అంటే.. నిజంగా ఎవరూ అనుకోని కాంబో ఇది. అదే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో అనిల్ రావిపూడి మూవీ. నిన్న త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ కి హారిక హాసిని ప్రొడక్షన్ తో పాటుగా ఎన్టీఆర్ ఆర్ట్స్ కళ్యాణ్ రామ్ కలిసినట్టుగా నిర్మాత నాగవంశీ అనౌన్సమెంట్ ఇచ్చారు.
కట్ చేస్తే ఈరోజు ఎవరూ ఊహించని కాంబో.. అనిల్ రావిపూడి తో ఎన్టీఆర్ సినిమా అంటూ న్యూస్ వచ్చేసింది. కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో. స్వయంగా ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా అనిల్ రావిపూడితో సినిమా ప్రకటిస్తూ అనిల్ రావిపూడి, కళ్యాణ్ రామ్ తో కలిసి తో దిగిన ఫోటోని షేర్ చేసి.. ఇది కడుపుబ్బా నవ్వించేలా ఉంటుంది అని పోస్ట్ చేసారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ చేస్తున్నారు, తర్వాత త్రివిక్రమ్ తో గాడ్ ఆఫ్ వార్ ఉంది. ఇక కళ్యాణ్ రామ్ జనవరి 12 విడుదల చిత్రాన్ని అనిల్ రావిపూడి తో చేస్తున్నారు. నిన్ననే అనిల్ రావిపూడి తో దిల్ రాజు మూవీ 2027 లో మొదలై 2028 సంక్రాంతి కి రిలీజ్ అని ప్రకటించారు. ఇన్ని ట్విస్ట్ ల మద్యన ఎన్టీఆర్-అనిల్ రావిపూడి కాంబో సెట్ అయ్యింది.














































