సీనియర్ నటుడు గిరిబాబు ఇక లేరు

Senior actor Giribabu is no moreSenior actor Giribabu is no more

 

టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. విలక్షణమైన పాత్రలతో అలరించిన సీనియర్ నటుడు గిరిబాబు మృతి చెందారు. గిరిబాబు వయసు 80 సంవత్సరాలు, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించారు.

1946 జూన్ 8న ప్రకాశం జిల్లా రావినూతలలో జన్మించిన గిరిబాబు.. 1973లో జగమే మాయ చిత్రంతో విలన్‌గా సినిమా పరిశ్రమలోకి ఎంటర్ అయ్యారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు.

కెరీర్ లో గిరిబాబు 600కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా తెలుగు చిత్ర పరిశ్రమకు సేవలందించారు. 

Sr Telugu Actor Giribabu Passes Away